నిజాంపేట: నేటి ధాత్రి
ఇటీవల కాలంలో అనారోగ్య సమస్యల వల్ల మృతి చెందిన కరీంనగర్ డైరీ కి చెందిన వినియోగదారుడు కోమ్మిడి మధుసూదన్ రెడ్డి కుటుంబానికి ఇన్సూరెన్స్ డైరీ యజమాన్యం అందజేశారు. ఈ మేరకు నిజాంపేట మండల పరిధిలోని నందగోకుల్ గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందాడు. మంగళవారం నాడు గ్రామ డైరీ యజమాని మ్యాదరి స్వామి ఆధ్వర్యంలో డైరీ యజమాన్యం 50 వేల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కును తన భార్యకు అందజేశారు. ఈ సందర్భంగా యజమాన్యం మాట్లాడుతూ వినియోగదారులకు ఇన్సూరెన్స్ లో ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. భార్యాభర్తలకు ఇన్సూరెన్స్ లు వర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు.