Double Bedroom Housing Issues to Be Resolved
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమస్యలను పరిష్కరిస్తాం…
మున్సిపల్ చైర్ పర్సన్ సంధ్యారాణి, వైస్ చైర్మన్ సరిత
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమస్యలను, పరిసర ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని మునిసిపాలిటీ చైర్ పర్సన్ గొడిసెల సంధ్యారాణి ,వైస్ చైర్ పర్సన్ మిట్టపల్లి సరిత లు అన్నారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీ లో నూతన చైర్మన్, వైస్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన రెండు రోజులకే పేదలకు సంబంధించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు సమస్యల వలయంలో ఉన్నాయని తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు ఇండ్ల ప్రాంతాన్ని కూటమి కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. అనంతరం చైర్ పర్సన్ సంధ్యారాణి, వైస్ చైర్మన్ సరిత లు మాట్లాడారు.
క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రవీంద్రఖని రైల్వే స్టేషన్ సమీపంలో గత ప్రభుత్వ హయాంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో 286 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక స్థానిక మంత్రి వివేక్ వెంకటస్వామి అర్హులైన పేదలకు సుమారు 230 ఇండ్లను కేటాయించారని అన్నారు. అట్టి డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రాంతంలో సమస్యలు నెలకొని ఉన్నాయని తెలియడంతో బిఆర్ఎస్ సీపీఐ కౌన్సిలర్లు, మున్సిపాలిటీ అధికారులతో కలిసి సందర్శించామని తెలిపారు. ఇండ్ల సమీపంలో చుట్టూ పిచ్చి మొక్కలు ఉండగా,విద్యుత్ తాగునీటి సమస్య ఉన్నట్లు గుర్తించి సత్వరమే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఇంటి డోర్లు, కిటికీలు, డ్రైనేజీ, పూర్తిగా అధ్వానంగా ఉండడంతో ఇండ్లలోకి ఎవరు రావడంలేదని స్థానికంగా ఉంటున్న కొందరు తెలిపారని, ఇట్టి విషయాన్ని స్థానిక మంత్రి వివేక్ వెంకటస్వామి కి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రాంతంలో నెలకొని ఉన్న సమస్యలను తెలియపరుస్తామని, సమస్యను పరిష్కరించేందుకు నిధులు మంజూరు చేయాలని కోరుతామని,వెంటనే వాటన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలియచేశారు. వారం రోజులలో ఇండ్ల చుట్టూ నెలకొని ఉన్న పిచ్చి మొక్కలను క్లీన్ చేయిస్తామని, మంచినీటిని సైతం అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు రాజా రమేష్,పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, రామిడి కుమార్,సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, కౌన్సిలర్లు కౌడగొని సాంబయ్య , జుంజుపల్లి శశి కుమార్, మద్దెల శంకర్, ముని, వెనంక శ్రీనివాస్, బొమ్మ భూమయ్య గౌడ్, జక్కనబోయిన మంజుల, కొప్పి రాజశేఖర్, ఆర్నె సంధ్య, గండమాల కృపానందం, రంగ లక్ష్మీ, బబ్బెర స్వర్ణలత, సీనియర్ నాయకులు రామిడి కుమార్,మాజీ కౌన్సిలర్లు పోగుల మల్లయ్య, జిలకర మహేష్, అనిల్ రావు, తదితరులు పాల్గొన్నారు.
