అధ్వానంగా మారిన గ్రామ రోడ్డు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల బొప్పనపల్లి యువ నాయకులు శశివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మండల
గ్రామీణ ప్రాంతాలకు రహదారుల అభివృద్ధికి పట్టుకొమ్మలు అని అంటారు. అలాంటి రోడ్లు మండలంలోని బొప్పనపల్లి గ్రామ రోడ్డు పూర్తిగా పాడైపోయ్యాయి. గ్రామాల అభివృద్ధికి రహదారులు మూలస్తంభంగా ఉంటాయని అన్నారు. కానీ గ్రామీణ రహదారులు పూర్తిగా అధ్వానంగా
మారినాయియని. అడుగేస్తే మడుగు అనే అంతలా పరిస్థితి ఉంది. రోడ్డు నిర్మాణం, మారమ్మతులపై ఉన్న ప్రభుత్వ పాలకులు ఇచ్చిన హామీలు గాలిలో కలిశాయాన్నట్టుగా ఉంది. ఒక వైపు కంకర తేలిన రోడ్డు, మరో వైపు గుంతల రోడ్డు, ఇంకో వైపు మూలమలుపు లతో రోడ్డు ద్విచక్ర వాహనాలకు రాత్రి సమయంలో ప్రమాదకరంగా మారిందన్నారు. ఝరాసంగం మండలానిక సమీపంలో ఉన్న బొప్పనపల్లి గ్రామం, రోడ్డు అధ్వానంగా మారిందన్నారు, వెంటనే అధికారులు స్పందించి మరమ్మతు చేయించాలని కోరారు,
