వనపర్తి లో లేబర్ లైసెన్స్ రెన్యువల్ చేయాలి
టి జె ఎస్ జిల్లా అధ్యక్షులు
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా కేంద్రంలో ఉల్లిగడ్డల షాపులు అల్లం ఎల్లిగడ్డ షాపులు వివిధ వ్యాపార సంస్థలకు ప్రభుత్వo లేబర్ లైసెన్సులు రెన్యు వల్ చేయాలని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎంఏ ఖాదర్ పాషా డిమాండ్ చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇచ్చిన లైసెన్సులు ఇంతవరకు లేబర్ అధికారులు రెన్యువల్ చేయకపోవడంపై విమర్శించారు జిల్లా కేంద్రం విస్తరించిందని ఆయన పేర్కొన్నారు . ప్రభుత్వానికి లేబర్ లైసెన్సులు రెన్యువల్ చేస్తే ఆదాయం వస్తుందని ఆయన పేర్కొన్నారు. లేనిచో లేబర్ ఆఫీసర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా భవన్ చీఫ్ సెక్రటరీ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని ఆయన పేర్కొన్నారు వనపర్తి లో షాపుల్లో లేబర్ ను తాగిన వారిని పెట్టుకుంటున్నారని వారు ప్రజలపై దాడులు చేస్తున్నారని ఆకస్మిక తనిఖీలు నిర్వహించి షాపులపై అదేవిధంగా వారు పెట్టుకునే లేబర్ ను డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ చేసి కేసులు నమోదు చేయాలని కోరారు వారి లై సన్సులు రద్దు చేయాలని కోరారు వృద్ధులను వికలాంగులను షాపుల లో పెట్టుకొని వారికి సరి అయిన జీతభత్యాలు ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు లేబర్ యాక్ట్ ప్రకారం స్కూల్ కి వెళ్లే విద్యార్థులను స్కూల్ కి వెళ్లకుండా పనికి పెట్టుకునే వారిపై విచారణ తెరిపి జరిమానాల విధించాలని ఆయన డిమాండ్ చేశారు
