విద్యాశాఖ మంత్రిని తొలిగించాలి
ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో తప్పులు దొర్లాయని పూర్తి బాధ్యతను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వహించాల్సిన అవసరం ఉందని విద్యాశాఖ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని బిసి సంక్షేమ సంఘం యువజన విభాగ జాతీయ కార్యదర్శి కల్లూరి పవన్ అన్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు 5లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.