మున్సిపల్ కమిషనర్ కువినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకులు
పరకాల నేటిధాత్రి
వెల్లంపల్లి రోడ్డు దామెర చెరువువద్ద యూ టర్న్ చిన్నగా ఉన్నందున తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆ యుటర్న్ ను 30 ఫీట్లుకు పెంచాలని బిజెపి పరకాల పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో పరకాల మున్సిపల్ కమిషనర్ సుష్మ కి బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా పరకాల కౌన్సిలర్ జయంత్ లాల్,పరకాల పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్ మాట్లాడుతూ దామెర చెరువు క్రాస్ వద్ద ఉన్న యూటర్న్ 15 ఫీట్లకు మాత్రమే వుందని అక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని యూటర్న్ చేసే క్రమంలో ప్యాసింజర్ ఆటోలు,గూడ్స్ ఆటోలు, కార్లు, ట్రాక్టర్,పెద్ద వెహికల్స్ లకు యూటర్న్ తీసుకునే క్రమంలో రోడ్డు వెడల్పు తక్కువగా ఉండి టర్న్ చేసే క్రమంలో ఇబ్బందికార పరిస్థితి ఏర్పడుతుందని దీంతో వెనుక వైపు నుంచి వచ్చే వాహనాలు ఒకరికొకరు ఢీకొని ప్రమాదాలు జరిగిన సంఘటనలు అనేకం ఉన్నాయని కావున మీరు తక్షణమే పై విషయం పై స్పoదించి డివైడర్ను 30 ఫీట్లకు వెడల్పు చేసి ప్రజలకు మరియు వాహనదారులకు సహకరించగలరని అన్నారు.ఈ కార్యక్రమంలో ఓ బి సి జిల్లా అధ్యక్షులు
పరకాల కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణచారి,మార్తా బిక్షపతి,సంఘ పురుషోత్తం, పాలకుర్తి తిరుపతి,వెనిశెట్టి శారద,దామ సతీష్,వీర్ల సమ్మయ్య,మెంతుల సురేష్, ముత్యాల దేవేందర్,గాజుల రంజిత్,ఆకుల శ్రీధర్,సంఘ నరేష్,కానుగుల గోపీనాథ్, ఆర్పీ సంగీత,కంటాత్మకూర్ మాజీ సర్పంచ్ శివకుమార్ సుంకరిసత్యనారాయణ,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.