దేవరకద్ర నేటి/ధాత్రి
దేవరకద్ర నియోజకవర్గం మదనపురం మండలం ద్వారక నగర్ గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుత.. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తామని, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతర ప్రక్రియ అన్నారు. ఇందులో ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామసభలలో ఇందిరమ్మ ఇండ్లకు, రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన..ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని తెలిపారు. అందులో భాగంగా ఈనెల 26 రిపబ్లిక్ డే నుండి రూ.12 వేలు రైతు భరోసా వేస్తామని తెలియజేశారు. అదేవిధంగా భూమిలేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కిందరూ.12 వేలు అందజేస్తామన్నారు