పట్టణాల అభివృద్దే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలి
కొయ్యాడ శ్రీనివాస్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు
పరకాల నేటిధాత్రి
ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి అదేశాలమేరకు(1,2,3)వార్డులలో కాంగ్రేస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యడా శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్,మాజీ ఎమ్మెల్యే మొలుగురి భిక్షపతి,ఎఎంసి చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన,మరియు ఎస్ సి వర్గీకరణ తో పాటు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఒంటెరు రామ్మూర్తి,1,2,3 వార్డుల మాజీ కౌన్సిలర్లు మడికొండ సంపత్ కుమార్,కుంకుమేశ్వర అలయకమిటి ఛైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావు, పరకాల పట్టణ కాంగ్రేస్ పార్టీ సమన్వయకమిటి సభ్యులు సోదా రామకృష్ణ,పావుశెట్టి వెంకన్న,బండి సదానందం, ఎం డి రంజాన్ అలీ,నల్లెళ్ల అనిల్ కుమార్,దుబాసి వెంకటస్వామి,పసుల రమేష్,చిన్నల గొనాద్,బుర్ర రాజమోగిలి, బండి సదానందం గౌడ్ న ల్లెల అనిల్ డాక్టర్.మడికొండ శీను పాలకుర్తి శ్రీనివాస్ వార్డ్ కమిటీ సభ్యులు,ఇందిరమ్మ కమిటీ సభ్యులు,కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.