చిట్యాల, నేటిధాత్రి ;
జయశంకర్ జిల్లాలోని చిట్యాల మండలంలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను చిట్యాల మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతల రమేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు యూనియన్ నాయకులు పరామర్శించి వారికి ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. ఒడితల గ్రామంలోని ఫోటోగ్రాఫర్ మేరుగు మహేందర్ తల్లి పద్మ మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. పద్మ గారి మృతి పట్ల అశ్రునివాళి అందించిన అనంతరం చిట్యాల మండల కేంద్రంలోని బీ ఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు బుర్ర శ్రీధర్ తల్లి వెంకటలక్ష్మి మృతి చెందగా ఆమె కుటుంబ సభ్యుల్ని పరామర్శించి తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కట్కూరి రమేష్ కోశాధికారి మాచర్ల సంజీవ్ నాయకులు సరిగొమ్ముల రాజేందర్ గుర్రపు తిరుపతి మ్యాదరి సునీల్ లక్ష్మీనరసింహరాజు కట్కూరి రాజు తదితరులు పాల్గొన్నారు.