మరువలేని మహనీయుడు వైయస్సార్

జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ మరియు కాంగ్రెస్ నేత నాసిరెడ్డి సాంబశివరెడ్డి

ఘనంగా వైయస్ జయంతి వేడుకలు…

మంగపేట,నేటిధాత్రి

సమాజం మరువలేని మహనీయుడు జాతి గర్వించదగ్గ నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు సోమవారం దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వికాస్ అగ్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు వైయస్సార్ చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ అంటే సంక్షేమ సారధి అని కొనియాడారు ఆయన పాలనలో రైతు రుణమాఫీ ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబర్స్మెంట్ వంటి అనేక పథకాలను అమలు చేశారన్నారు దండగలా పడి ఉన్న వ్యవసాయ రంగాన్ని పండగ చేసిన అపర భగీరథుడు వైయస్సార్ అని సాంబశివరెడ్డి అన్నారు అనంతరం అకినేపల్లి మల్లారం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నోటు పుస్తకాలు పెన్నులు పెన్సిల్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి నాగేశ్వరరావు స్కూల్ అసిస్టెంట్ సరోజా ఎస్ జి టి రామ్ సింగ్ వికాస్ అగ్రీ ఫౌండేషన్ ప్రతినిధులు పూర్ణ ప్రసాద్ తిరుపతిరావు శేషారెడ్డి కాంగ్రెస్ నాయకులు మాధవరెడ్డి తొండపు శ్రీనివాసరెడ్డి విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *