కొల్చారం,( మెదక్ )నేటి ధాత్రి:-
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి ఉత్సవాలను అన్ని జిల్లాలో ఘనంగా జరిపారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్నగనాపూర్ గ్రామంలో మెదక్ – సంగారెడ్డి ప్రధాన జాతీయ రహదారి పక్కన వైయస్ షర్మిల పాదయాత్ర చేసినప్పుడు చిన్న ఘనపూర్ గ్రామంలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ జయంతి వేడుకలు జరుపుకున్నప్పటికీ చిన్న ఘనపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి కనీసం పూలమాల కూడా వేయకపోవడం సిగ్గుచేటు. ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని, గల్లి గల్లికి తిరుగుతారు తప్ప, గత అసెంబ్లీ ఎన్నికల్లో, మెదక్ ఎంపీ పార్లమెంట్ ఎన్నికల్లో చిన్న ఘనాపూర్ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి 200 పై చిలుకు మెజార్టీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇదే మార్గాన పాదయాత్ర కూడా చేశారు. చిన్న గణపురం గ్రామ ప్రజలు మాట్లాడుతూ వైయస్ చేసిన సేవలను మర్చిపోవడం ఎంతవరకు సమంజసం అని చిన్నగనాపూర్ గ్రామ ప్రజల ఆరేపిస్తున్నారు.