Headlines

కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డ ఎమ్మెల్యే పెద్ది

ప్రజల కోసం ఎప్పుడు రానోడు ఓట్ల కోసం మళ్ళా వస్తున్నడు..
కాంగ్రెస్ పార్టీ వస్తే రాష్ట్రం ఆగమే..
# నన్ను బలోపేతం చేస్తే ప్రజలే బలవంతులు


# నేను రైతు బిడ్డను మీ సంక్షేమం కోసం
# నర్సంపేట బిఅర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

# రెండవ రోజు మరింత జోష్ నింపిన బిఅర్ఎస్ ఎన్నికల ప్రచారం

# అడుగడుగున ఎమ్మెల్యే పెద్ది బతుకమ్మలు,బోనాలు మంగళహారతులతో నీరాజనాలు పలికిన మహిళలు.

నర్సంపేట,నేటిధాత్రి :

గత ఐదు సంవత్సరాలుగా నర్సంపేట నియోజకవర్గంలో ప్రజలకు ఎన్నో కష్టాల పాలయ్యారు. రెండేళ్లు కరోనా సమయంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. కష్టకాలంలో ప్రజలను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎన్నడు రానోడు నేడు ఓట్ల కోసం మీ వద్దకు వస్తున్నాడు జాగ్రత్త ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి అంటూ బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల ప్రచారంలో పిలుపునిచ్చారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నర్సంపేట మండలంలోని నరసింగాపురం గ్రామంలో మొదలు కాగా ఆయా గ్రామాలలో నిర్వహిస్తూ లక్నేపల్లిలో ముగించారు. గ్రామాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో గ్రామ దేవతల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రచారం మొదలైన నుండి ముగింపు వరకు గ్రామాలలో మహిళలు బతుకమ్మలు బోనాల మంగళ హారతులతో నీరాజనాలు పలికారు. పలువురు మహిళలు కోలాటాలు డప్పు చప్పులు ఎంతగానో అలరించాయి. భారీ ఎత్తున జరిగిన ప్రచార కార్యక్రమం టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నింపింది.
ఈ సందర్భంగా వేరువేరు గ్రామాలలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గత 60 ఏళ్లుగా చేయని అభివృద్ధి తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ముఖ్యమంత్రి పదవి కోసం వాళ్ల కొట్లాటకే ఐదేళ్లు సరిపోతుందని దీంతో రాష్ట్రం ఆగమే అని పెద్ది ఆరోపించారు.నేను రైతు బిడ్డను మీ సంక్షేమం కోసం కృషి చేస్తున్న మీరు అడగకుండా నియోజకవర్గానికి అనేక రైతు సంక్షేమ పథకాలను తీసుకువచ్చి గోదావరి జలాలతో మీ పాదాలు కడిగిన బిడ్డను నన్ను మరోసారి దీవించండి అంటూ ఓటర్లను వేడుకున్నారు.ఎన్నికలలో నన్ను బలోపేతం చేస్తే ప్రజలే బలవంతులు అవుతారని చెప్పారు.
ఎన్నికల ప్రచారం టిఆర్ఎస్ కార్యకర్తలకు జ్యూస్ నింపడంతో ఇదే రెట్టింపు ఉత్సాహాన్ని పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కోరారు.నియోజకవర్గానికి పరిమితమై మీకు అందుబాటులో ఉంటూ సేవలు అందించిన వ్యక్తిని నేను. కాంగ్రెస్ పార్టీ నాయకునిలాగా నా దగ్గర దంధాలు, చంధాలు లేవు. నా దగ్గర ఉన్నదల్లా మీరే… అభివృద్ధి మాత్రమే నాది అని పేర్కొన్నారు.నియోజకవర్గంలో ఏ ఊరు రికార్డ్ తీసిన అభివృద్ధిలో మార్క్ నాదే కనిపిస్తున్నది తెలిపారు.నర్సంపేటకు మెడికల్ కళాశాల, జిల్లా పెద్దాసుపత్రి తీస్కొచ్చిన నన్ను మీ పెద్ద మనసుతో దీవించాలని కోరారు.ఇప్పటికే అభివృద్ధి చేసింది చాలా ఉంది. చేయాల్సింది ఇంకా మిగిలి ఉన్నది కావున నేను గెలుస్తెనే అభివృద్ధి పూర్తి అవుతుంది అని ఎమ్మెల్యే వివరించారు.నేడు జరిగే ఎన్నికల యుద్ధం సేవ చేయని సమర్థులకు ప్రజల పట్ల పట్టింపులేని అసమర్థులకు మధ్య జరుగుతున్న యుద్ధం న్యాయ నిర్ణేతలు మీరే అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారం మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, ఎంపీపీ మోతే కళావతి పద్మనాభరెడ్డి, జడ్పిటిసి కోమాండ్ల జయ గోపాల్ రెడ్డి, సొసైటీ చైర్మన్ మోరాల్ల మోహన్ రెడ్డి, సర్పంచులు దస్రు నాయక్, రాంబాబు గౌడ్, మండల రవీందర్,కొడారి రవి,బరిగెల లావణ్య కిషోర్,
ఎంపీటీసీలు పెద్ది శ్రీనివాస్ రెడ్డి,వీరన్న నాయక్, సుంకరి సంతోష్ రెడ్డి,రాజన్న నాయక్,ఈర్ల నర్సింహరాములు, రాం ప్రసాద్,కట్ల సుదర్శన్ రెడ్డి,మోతే జైపాల్ రెడ్డి,కుమారస్వామి, మోటూరి
రవి,ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు,మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *