సీఎం మేడిగడ్డ పర్యటనకు ముందు విషాదం

బలగాలు కూంబింగ్ చేస్తుండగా కానిస్టేబుల్ మృతి..

వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగలి బలి

కాటారం నేటి ధాత్రి మేడిగడ్డకు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటిo చనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా కాటారం మండలం నస్తుర్పల్లి అటవీ ప్రాంతంలో వేటగాళ్లు వన్యప్రాణుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు ప్రవీణ్ (32) అనే కానిస్టేబుల్ కు తగలడంతో కరెంట్ షాక్ కు గురయ్యాడు. వెంటనే ఆయనను భూపాలపల్లి లోని 100 పడకల ఆసుపత్రికి.. తరలిస్తుoడగా మృతి చెందాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *