రేపటి ప్రజావాణి రద్దు: హనుమకొండ జిల్లా కలెక్టర్
హనుమకొండ, నేటిధాత్రి.
హనుమకొండ కలెక్టరేట్లో ఈ నెల 7వ తేదీన నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ ఒక ప్రకటనలో తెలిపారు.
కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగే స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరవుతున్న నేపథ్యంలో ప్రజావాణిని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
ప్రజలు గమనించి ప్రజావాణికి రాకూడదని తెలిపారు.