భగవంతుని సేవలో తరించాలి

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి..

పూర్ణకుంభముతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

భగవంతుని సేవలో తరించాలి అని నూతనంగా ఎంపికైన మన్యం కొండ దేవస్థానం పాలకమండలి సభ్యులతో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గం లోని మన్యం కొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి పాలకమండలి నూతన సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవంతుని సేవ లభించడం ఇది పూర్వ జన్మ సుకృతం అని, భగవంతునికి చేరువగా చేరి సేవ చేసుకొనే అవకాశం చాలా అరుదుగా మాత్రమే లభిస్తుందన్నారు. మన్యం కొండ దేవస్థానాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందామని, ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని రకాల వసతులు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఈ దేవాలయ విశిష్టత తెలుసునని, అందుకే దేవాలయ అభివృద్ధికై ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. భక్తులకు అధునాతన సౌకర్యాలు ఏమి కావాలో వాటిని గుర్తించి అందించే దిశగా ముందుకు సాగుతున్నామని ఆయన స్పష్టం చేశారు. మన్యం కొండ జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సౌకర్యాలు కల్పించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మన్యం కొండ దేవస్థానం వారి నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అంతకుముందు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే కు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక నిర్వహించారు, వేదపండితులు ఎమ్మెల్యే కు వేద ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ అలహరి మధుసూదన్ చారి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ , మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి , వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లు అనిల్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బెజ్జుగం రాఘవేంధర్, మరియు మన్యం కొండ దేవస్థానం పాలకమండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!