వీణవంక,( కరీంనగర్ జిల్లా).
నేటి ధాత్రి:ధర్మ సమాజ్ పార్టీ వీణవంక మండల కమిటీ ఆధ్వర్యంలో మండల తాసిల్దార్ గారికి తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నం పైన సూచనలను తెలియజేస్తు వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.
ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన ఉస్మానియా యూనివర్సిటీ మరియు అందులో డాక్టరేటు పొందిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని, అగ్రవర్ణ భూస్వామ్య పెత్తందారు వ్యవస్థపై, అణగారిన వర్గాల రాజ్యం కోసం,వారి హక్కుల కోసం, పోరాడినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న, పండగ సాయన్న, సమ్మక్క, సారక్క వీరవనితలు యొక్క చిత్రాలను తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నంగా ఆమోదం చాలని ధర్మసమాజ్ పార్టీ తరఫున సూచనలను తెలియజేస్తూ వీణవంక తాసిల్దార్ గారికి విజ్ఞాపన పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మసమాజ్ పార్టీ మండల నాయకులు సదానందం,రాజేష్,రాజు,రవికిరణ్,రాకేష్, రాజేంద్ర ప్రసాద్,కిషోర్,అనిల్ తదితరులు పాల్గొన్నారు.