పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ ఒకటో వార్డులోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాల నందు బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది.స్థానిక కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ హాజరై బడి ఈడు పిల్లలను తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని,విద్యార్థులు ప్రభుత్వం అందించే వివిధ పథకాలను పొందుకొని చదువులో నైపుణ్యత పెంపొందించుకోవాలని కోరినారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చక్రవర్తుల మధుసారు,ఉపాధ్యాయులు దయ్యాల సదయ్య,సరళ, స్వామి,పద్మ,కల్పన,రమ, శారద,నాగరాజు సారంగపానిగారు,విద్యార్థిని విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.