అధికారులు సీజ్ చేసిన ఇసుక డంప్ మాయం.
అనంతగిరి, నేటి ధాత్రి:
రెవిన్యూ అధికారులు సీజ్ చేసిన ఇసుక డంఫ్ మాయం.మండల పరిధిలోని పాలవరం గ్రామంలో ఓ వ్యక్తి ప్రభుత్వం అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక డంపు చేశారని సమాచారంతో రెవెన్యూ అధికారులు సీజ్ చేసి గ్రామ కార్యదర్శికి అప్పగించారు.కాగా స్థానిక నాయకులు ఓ అధికారి సహాయంతో డంపు చేసిన వ్యక్తి ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. డంపు నుండి ఇసుక తరలించాలంటే మైనింగ్ అనుమతులతో డిడి చలానాతో తరలించాల్సి ఉంటుంది. ఇవేమీ లేకుండా అడిగేది ఎవరన్నట్లు ఇసుకను ఆక్రమంగా ఇతర ప్రాంతాలకు అమ్ముకున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అధికారుల సహకారం లేనిదే ఈ వ్యవహారం జరగదని,ఇన్ని రోజులు కళ్ళముందు డంపు కనిపించకపోయినా స్థానిక అధికారులు ఇసుక డప్పు ఏమైనట్లు అని విచారణ చేపట్టడం జరగలేదని కనీసం కన్నెత్తి కూడా చూడలేదని గ్రామస్తులు అంటున్నారు.సీజ్ చేసిన ఇసుక డంపును అక్రమంగా తరలించిన వ్యక్తిపై అదేవిధంగా బాధ్యతారహితంగా వ్యవహరించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
