పరకాలలో వినూత్న న్యూరో,జనరల్ హాస్పిటల్ సేవలు
పరకాల,నేటిధాత్రి
పట్టణంలో వినూత్న న్యూరో,జనరల్ హాస్పిటల్ ఆధునిక వైద్య సదుపాయాలతో ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు డైరెక్టర్ సామల తిరుపతి రెడ్డి వెల్లడించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ జనరల్ మెడిసిన్ న్యూరాలజీ విభాగాల్లో ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.డాక్టర్ డి.నాగరాజు ఆధ్వర్యంలో మెదడు సంబంధిత వ్యాధులు,స్ట్రోక్,తలనొప్పులు,నరాల సమస్యలు వంటి అనేక రోగాలకు చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.ముఖ్యంగా స్ట్రోక్ కేసుల్లో మొదటి 4 గంటల్లో థ్రాంబోలిసిస్ చికిత్స అందించే సదుపాయం కల్పించామని తెలిపారు.ఆసుపత్రిలో వెంటిలేటర్,ఐసీయూ,న్యూరాలజీ ల్యాబ్,ఫుల్ ఎక్విప్డ్ ల్యాబ్,ఫిజియోథెరపీ,ఫార్మసీ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.24 గంటల అత్యవసర సేవలు కూడా అందిస్తున్నట్లు పేర్కొన్నారు.పరకాల పరిసర ప్రాంత ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
