రాజీ మార్గమే రాజ మార్గం!
◆:- రాజీపడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ
◆:- పడవచ్చు జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి
◆:- ఎస్సై క్రాంతి కుమార్ పాటేల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసుల్లో కక్షిదారులు రాజీపడవచ్చు క్షణికావేశంలో జరిగిన తప్పులను సరిదిద్దు కోవడానికి రాజీమార్గమే రాజమార్గం కనుక నవంబర్ 15న శనివారం జరగనున్న జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని ఝరాసంగం మండల ఎస్సై క్రాంతి కుమార్ పాటేల్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ ను ఉద్దేశించి ఝరాసంగం మండల ఎస్సై క్రాంతి కుమార్ పాటేల్ మాట్లాడుతూ క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకోవాడానికి అదాలత్ అనేది ఒక మంచి అవకాశం అని, అనవసర గొడవలకు, పట్టింపులకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని మండల వ్యాప్తంగా నమోదైన, చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో కక్షిదారులు రాజీ పడుటకు జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.రాజీపడదగిన కేసుల్లో ఇరువర్గాల మధ్య పరస్పర అవగాహనతో పరిష్కారం కనుక్కోవడం వల్ల సమయం, ధనం, శ్రమ ఆదావుతుందని తెలిపారు. రాజీ ద్వారా అందరికీ న్యాయం లభిస్తుందని పేర్కొన్నారు. కానిస్టేబుల్ నుండి అధికారుల వరకు ప్రతి ఒక్కరు భాధ్యతగా వ్యవహరించి, రాజీ పడదగిన కేసులలో ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించి, వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీ పడేలా చేసుకోవాలన్నారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా సత్వర పరిష్కారం జరుగుతుందని తెలిపారు.
