ఎంపీడీవో రాజిరెడ్డి
నిజాంపేట, నేటిదాత్రి
ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో అర్హుల పేర్లు లేకపోతే ఆందోళన చెందవద్దని తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ రాజిరెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని చల్మెడ గ్రామంతో పాటు నిజాంపేట, కల్వకుంట, నందిగామ గ్రామాలలో నాలుగు పథకాలపై గ్రామసభల నిర్వహించి జాబితాలో ఉన్న పేర్లను చదివి వినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అసలైన లబ్ధిదారుల కోసం గ్రామసభలు నిర్వహిస్తున్నామని, ఏమైనా పొరపాట్లు జరిగితే అధికారుల దృష్టికి తీసుకవచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల్లో నిర్వహించిన అధికారులు తహసిల్దార్ సురేష్ కుమార్, మండలవ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, ఏ ఈ ఓ శ్రీలత, కార్యదర్శులు నర్సింలు, నరసింహారెడ్డి, ప్రశాంత్, గ్రామస్తులు పాల్గొన్నారు