విద్యార్థులకు బోర్డుపై వ్రాసి విద్యార్థులను ప్రశ్నలు అడుగుతున్న కలెక్టర్

విద్యార్థులకు బోర్డుపై వ్రాసి విద్యార్థులను ప్రశ్నలు అడుగుతున్న కలెక్టర్

వనపర్తి నేటిదాత్రి .

మర్రికుంట ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో క్రికెట్ హాకీ సమ్మర్ ట్రెనినింగ్ క్యాంపు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రార oబించార విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి క్విజ్, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు ఎంతగానో దోహదపడతాయని, అందుకే ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు టాలెంట్ ఫెస్ట్ నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ అన్నారు మంగళవారం జిల్లా కలెక్టర్ వనపర్తి మర్రి కుంటలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించారు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి విద్యార్థులకు బోర్డుపై వ్రాసి ప్రశ్నలు అడిగి తెలుకున్నారు
సమ్మర్ ట్రైనింగ్ క్యాంప్ ఏప్రిల్ 29 వరకు కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పాఠశాల వంటగదిని పరిశీలించారు వంటగది పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పాఠశాల సిబ్బంది ని ఆదేశించారు విద్యార్థులకు మంచి భోజనం అందించాలన్నారు స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి మెస్ కమిటీకి చెందిన విద్యార్థులు రిజిస్టర్లలో సంతకాలు చేస్తున్నారా లేదా అన్న విషయంపై కలెక్టర్ విచారణ చేశారు డ్రాయింగ్ వ్యాసరచన పోటీలను పరిశీలించారు విద్యార్థులను ప్రశ్నలు అడిగి సరైన సమాధానాలు చెప్పిన వారిని అభినందించారుఈ కార్యక్రమంలో తహసిల్దార్ రమేష్ రెడ్డి, ప్రిన్సిపల్ సరస్వతి పాఠశాల సిబ్బంది, అధికారులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version