
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని సాధించాలి.
బిజెపిరాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తి రెడ్డి.
చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనీ చిట్యాల మండలంలో జుకల్ గ్రామంలోని బిఎన్ అర్ ఫంక్షన్ హాల్ లో జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషిధర్ రెడ్డి అధ్యక్షతన జిల్లా స్థాయి స్థానిక సంస్థ ల ఎన్నికల కార్యాశాల నిర్వహించడం జరిగింది ,ఈ సమావేశంనీ కి ముఖ్య అతిథులుగా ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు జిల్లా ప్రబారి గల్ల సత్యనారాయణ మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తల బలం ఉన్న పార్టీ బీజేపీ. వారి కష్టం ఎప్పుడూ మర్చిపోము.మోడీ సర్కార్ మూడు నెలల రేషన్ బియ్యం ఇచ్చింది – రైతులకు బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ మోసం చేసింది.దేశంలో మతం పేరుమీద ఓట్లు అడిగిన పార్టీ కాంగ్రెస్. రాహుల్ గాంధీ ఎవ్వరు ఎంత ఉంటే అన్ని పదవులు ఇవ్వాలని అంటున్నారు.”
రేవంత్ రెడ్డి కేబినెట్లో ఎంత మంది బీసీలు ఉన్నారు? కుల గణన ప్రకారం కనీసం 8 మంత్రిత్వ పదవులు రావాలి.”
మతపరమైన రిజర్వేషన్లు ఉండకూడదని బీఆర్ అంబేద్కర్ స్పష్టం చేశారు – ఆ రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తాం. కాని కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు.”ఏ రాజ్యాంగం ప్రకారం మైనార్టీలకు 10% రిజర్వేషన్లు ఇచ్చారు”ప్రపంచవ్యాప్తంగా 26 దేశాలు ప్రధాని మోడీకి అత్యుత్తమ పురస్కారాలు ఇచ్చాయి.గ్రామాల్లోకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించండి” అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు నాగపురి రాజమౌళి గౌడ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపన్న గారు చదువు రామచంద్రారెడ్డి గారు పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నే మొగిలి రాష్ట్ర కౌన్సిలింగ్ నెంబర్ రాయరాకుల మొగిలి రాష్ట్ర నాయకులు బట్టు రవి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకల గణపతి అసెంబ్లీ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి చిట్యాల మండల అధ్యక్షులు బుర్ర వెంకటేశు గౌడ్ మరియు రాష్ట్ర జిల్లా మండల నాయకులు వివిధ మోర్చా జిల్లా అధ్యక్షులు వివిధ మండలాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు స్థానిక సంస్థల ప్రబారీలు కన్వీనర్లు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .