తెలంగాణ పిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీగా గుజ్జూల శ్రీనివాస్
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా గుజ్జుల శ్రీనివాస్‌రెడ్డిని నియమిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను శుక్రవారం మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ గుజ్జుల శ్రీనివాస్‌రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఆర్గనైజింగ్ సెక్రటీరగా నియమితులైన శ్రీనివాస్‌రెడ్డి పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని, తన నియమాకానికి సహకరించిన ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.