నడికూడ,నేటిధాత్రి:
మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమంతరావు,కృప మేడం ఆధ్వర్యంలో పాఠశాల పున ప్రారంభంలో భాగంగా పూలతో విద్యార్థులకు స్వాగతం పలికిన నడికూడ తహసిల్దార్ నాగరాజు,ఎంపిడిఓ శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయిని ఉపాద్యాయులు.అనంతరం తహసిల్దార్ నాగరాజు మాట్లాడుతూ ఉచిత పుస్తకాలు మరియు యూనిఫాం లు అందరి విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది కాబట్టి సద్వినియోగం చేసుకోవాల న్నారు.ఎంపిడిఓ శ్రీనివాస్ మాట్లాడుతూ మనకి ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం కూడా మన పాఠశాలలో అందించడం జరుగుతుంది కావున విద్యను బోధించే ఉపాధ్యాయిని ఉపాద్యాయులు మనకు అందుబాటులో ఉన్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.