మంగపేట నేటి ధాత్రి
పాము కాటుకు గురైన బాలిక మృతి చెందిన సంఘటన మంగపేట మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివ రాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్ణశాల బండ్రేవ్ చెందిన దండాల రాణి (15) అనే బాలిక కమలాపురం నుంచి మంగపేట మండలం రా జుపేట గ్రామపంచాయతీ దేవానగరంలోని పెద్దమ్మ. పెద్దనాన్న ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ఇంటిలో మంచంపై నుంచి కాళ్ళు కింద ఊపుతున్న సమయం పాము కాలుకు కాటు వేయడంతో కుటుంబసభ్యులు వెంటనే దగ్గర ఉన్న హాస్పిటల్ కు తీసుకొని వెళ్లారు. పరిస్థితి విషమించడంతో అక్కడ నుంచి హుటా హుటిన ఏటూరునాగారం ప్రభుత్వ హాస్పిటల్ తీసుకొని వెళ్లగా చికిత్స పొందుతూ బాలికమృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దీనితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.