క్షయ అంతం మనందరి పంతం
గంగారం, నేటిధాత్రి:
మహబూబాబాద్ జిల్లా గంగారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గంగారం నందు ప్రధానమంత్రి టీవీ ముక్తాభియాన్ కార్యక్రమంలో భాగంగా డా’ప్రత్యూష ఆధ్వర్యంలో క్షయ వ్యాధి స్క్రీనింగ్ నిర్వహించడం జరిగింది అనుమానితులను ఎక్స్రే పరీక్షల నిమిత్తం గూడూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి 102 , రబీకస్కె వెహికల్ ద్వారా తరలించారు క్షయ వ్యాధి లక్షణాలు ఉన్నవారి నుండి తెమడ సేకరించి పరీక్షలు నిర్వహించారు. ఇట్టి క్యాంపులో భాగంగా బరువు తక్కువ ఉండి తరచు వ్యధుల భరిన పడేఅంగన్వాడి పిల్లలను, వ్యాధి లక్షణములున్న పాఠశాల విద్యార్థులను స్థానిక వైద్యాధికారి మండల ప్రత్యూష పరీక్షించారు. అదేవిధంగా క్షయవ్యాధి మందులు వాడుతున్నటువంటి 11 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు తన సొంత ఖర్చులతో పోషకాహార కిట్స్ పంపిణీ చేయడం జరిగింది.అనంతరం డా. ప్రత్యూష మాట్లాడుతూ టీబి ని నయం చేయాలంటే క్రమం తప్పని మందులతో పాటుగా మంచి ఆహారం తీసుకుంటే త్వరగా తగ్గిపోతుంది అని తెలిపారు. కార్యక్రమంలో Dr ప్రత్యూష, డా.శ్రీకాంత్, లక్ష్మి స్టాఫ్ నర్స్, రమాదేవి, రాజు ల్యాబ్ టెక్నీషియన్, శ్రీరాములు, రాంబాబు, మోహన్, టీవీ ట్రీట్మెంట్ సూపర్వైజర్