హనియ ను సన్మానించిన పాషా…

హనియ ను సన్మానించిన పాషా
మెట్ పల్లి ఏప్రిల్ 30 నేటి దాత్రి

పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 550 మార్కులు సాధించిన మెట్ పల్లి పట్టణానికి చెందిన వివేకానంద హైస్కూల్ విద్యార్థిని, మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా ప్రధాన కార్యదర్శి మహ్మద్ అజీమ్ కూతురు హనియ హోరిన్ ను కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబోద్దీన్ పాషా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముజీబ్, రహిమోద్దీన్, షారు, మజార్, అనష్, అబూజర్ తదితరులు పాల్గొన్నారు.

మల్లాపూర్ మండల్ మొగిలిపేట గ్రామనీకి చెందిన ముగ్గురు బాలికలు మండల టాపర్స్

మల్లాపూర్ మండల్ మొగిలిపేట గ్రామనీకి చెందిన ముగ్గురు బాలికలు మండల టాపర్స్
మల్లాపూర్ ఏప్రిల్ 30 నేటి దాత్రి

 

పదవ తరగతి పరీక్ష ఫలితాలలో భాగంగా మొగిలిపేట గ్రామానికి చెందిన
ర్యాపని అనుష్క 574
గడ్డం అనువంశిక 573
బొడ్డు రిషిక. 572
మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు ముందు భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ కన్న తల్లిదండ్రులకు మరియు పుట్టిన గ్రామానికి చదువు చెప్పిన ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ చదువులో ఆర్థిక వెనుకబాటు ఉండకూడదని భావనతో పాఠశాల ఆవరణలో శాలువాతో సన్మానం చేసి నాకు తోచినంత నా సొంత నిధులతో మొదటి మూడు ర్యాంకు లు సాధించిన విద్యార్థి విద్యార్థులకు చిన్న నగదు ప్రోత్సాహం చేసి ఇతర విద్యార్థులకు శాలువాతో చిన్న సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇంత మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయ బృందానికి మొగిలిపేట గ్రామ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇట్టి కార్యక్రమంలో సర్పంచ్ కళా రమేష్ ఉప సర్పంచ్ దండవేని రాజేందర్ వార్డు సభ్యులు నాయకులు పాల్గొని విద్యార్థి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

10వ తరగతి ఫలితాల్లో మంచిర్యాల నారాయణ విద్యార్థుల ప్రభంజనం

10వ తరగతి ఫలితాల్లో మంచిర్యాల నారాయణ విద్యార్థుల ప్రభంజనం

మంచిర్యాల,నేటి ధాత్రి:

పదవ తరగతి ఫలితాలలో నారాయణ స్కూల్ ప్రభంజనం బుధవారం విడుదలైన తెలంగాణ పదవ తరగతి ఫలితాల్లో మంచిర్యాల నారాయణ హైస్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు.పాఠశాల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం.మొత్తం 32 మంది విద్యార్థుల్లో 25 మందికి పైగా 500కు పైగా మార్కులు సాధించి రాష్ట్ర, జిల్లా స్థాయి ర్యాంకులను దక్కించుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల డీజీఎం వెంకటరమణ రెడ్డి,ఏజీఎం చైతన్య రావు మాట్లాడుతూ,విద్యార్థుల పట్టుదల,క్రమశిక్షణతో పాటు ఉపాధ్యాయుల నిరంతర శ్రమ ఈ విజయానికి కారణమని తెలిపారు.ఉన్నత లక్ష్యాలతో చదివిన విద్యార్థులకు,వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు.విజయం సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం,ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు.భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఏజీఎం చైతన్య రావుతో పాటు ఆర్‌ఐ సత్యం రావు,హైస్కూల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్,ప్రిన్సిపాల్ స్రవంతి, అకాడమిక్ డీన్ వెంకటస్వామి, ఏజీఎం అనాలిసిస్ రాజేందర్, ఏవో కిషన్ తదితరులు పాల్గొన్నారు.

పదవ తరగతి ఫలితాలలో మల్యాల ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రభంజనం

పదవ తరగతి ఫలితాలలో మల్యాల ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రభంజనం

చందుర్తి, నేటిధాత్రి:

 

నిన్న విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో చందుర్తి మండలం లోని మల్యాల ఉన్నత పాఠశాలలో మొత్తం 47 మంది విద్యార్థులకు అందరు పాసై 100% ఉత్తీర్ణత సాధించినారు. ఇందులో 20 మంది విద్యార్థులు 500 కు పైగా మార్కులతో విజయ దుందుభి మ్రోగించినారు. 563 మార్కులతో పులికీర్తన, 556 మార్కులతో ఎల్ల చరణ్ పాఠశాలలో ప్రథమ ద్వితీయ స్థానాలలో నిలిచినారు.

గణితంలో 15 మంది, సాంఘిక శాస్త్రంలో 14 మంది, ఆంగ్లంలో 11 మంది విద్యార్థులు 90కి పైగా మార్కులు సాధించినారు.500 కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను గ్రామ సర్పంచ్ మందాల శారద అబ్రహం, గ్రామ ఉపసర్పంచ్ అనపర్తి నరేష్,గ్రామ పాలకవర్గ సభ్యులు అభినందించి ఘనంగా సన్మానించినారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షురాలు పీసరి మంజుల, స్వామి వివేకానంద సేవ సమితి సభ్యులు, ప్రధానోపాధ్యాయులు శరత్ చంద్ర, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పది ఫలితాల్లో ప్రతిభ చూపిన ఉప్పల్ బాలుర పాఠశాల…..

పది ఫలితాల్లో ప్రతిభ చూపిన ఉప్పల్ బాలుర పాఠశాల…..

నూటికి నూరు శాతం ఉత్తీర్ణత….

నేటిధాత్రి

కమలాపూర్ (హన్మకొండ) 2025-26

పదవ తరగతి పరీక్షల్లో మండలములోని ఉప్పల్ బాలుర పాఠశాల అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం నిర్మల తెలిపారు.బుధవారం విడుదలైన ఫలితాల్లో పాఠశాల విద్యార్థి అలుగు తేజ 545 మార్కులు సాధించి మండల పరిధిలోగల ప్రభుత్వ పాఠశాల ఫలితాల్లో ద్వితీయ స్థానం సాధించినట్లు తెలిపారు.పదవ పరీక్షల్లో 18 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా నూటికి నూరు శాతం 18 మంది ఉత్తీర్ణత సాధించినట్లు వారిలో నలుగురూ విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అభినందించారు.మంచి నిక్షానితులైన ఉపాధ్యాయ బృందం విద్యార్థుల అత్యుత్తమ ఫలితాలకు కారణమని కొనియాడారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version