10వ తరగతి ఫలితాల్లో మంచిర్యాల నారాయణ విద్యార్థుల ప్రభంజనం
మంచిర్యాల,నేటి ధాత్రి:
పదవ తరగతి ఫలితాలలో నారాయణ స్కూల్ ప్రభంజనం బుధవారం విడుదలైన తెలంగాణ పదవ తరగతి ఫలితాల్లో మంచిర్యాల నారాయణ హైస్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు.పాఠశాల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం.మొత్తం 32 మంది విద్యార్థుల్లో 25 మందికి పైగా 500కు పైగా మార్కులు సాధించి రాష్ట్ర, జిల్లా స్థాయి ర్యాంకులను దక్కించుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల డీజీఎం వెంకటరమణ రెడ్డి,ఏజీఎం చైతన్య రావు మాట్లాడుతూ,విద్యార్థుల పట్టుదల,క్రమశిక్షణతో పాటు ఉపాధ్యాయుల నిరంతర శ్రమ ఈ విజయానికి కారణమని తెలిపారు.ఉన్నత లక్ష్యాలతో చదివిన విద్యార్థులకు,వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు.విజయం సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం,ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు.భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఏజీఎం చైతన్య రావుతో పాటు ఆర్‌ఐ సత్యం రావు,హైస్కూల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్,ప్రిన్సిపాల్ స్రవంతి, అకాడమిక్ డీన్ వెంకటస్వామి, ఏజీఎం అనాలిసిస్ రాజేందర్, ఏవో కిషన్ తదితరులు పాల్గొన్నారు.
