మూడవ రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె..

మూడవ రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె

బస్టాండ్ కూడలిలో ట్రాఫిక్‌కు అంతరాయం

పరకాల,నేటిధాత్రి

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె పరకాల పట్టణంలో మూడవ రోజుకు చేరుకుంది.సమ్మె కారణంగా బస్సు సేవలు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ వాహనాలపై ఆధారపడుతున్నారు.ఈ క్రమంలో బస్టాండ్ కూడలి వద్ద ఆటోలు,క్యాబ్‌లు,ఇతర ప్రైవేట్ వాహనాలు అధిక సంఖ్యలో నిలిపివేయబడుతున్నాయి. నియంత్రణ లేకుండా పార్కింగ్ చేయడంతో అక్కడ ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా పెరిగింది.ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతూ,ప్రయాణికులు మరియు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.ముఖ్యంగా పీక్ అవర్స్ సమయంలో పరిస్థితి మరింత విషమంగా మారుతోంది.ట్రాఫిక్ సమస్యనునియంత్రించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.మరోవైపు,కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించే వరకు సమ్మె కొనసాగుతుందని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.

ఆర్టీసీ సమ్మెకు భారతీయ మజ్దూర్ సంఘ మద్దతు…

ఆర్టీసీ సమ్మెకు భారతీయ మజ్దూర్ సంఘ మద్దతు

పరకాల,నేటిధాత్రి

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు భారతీయ మజ్దూర్ సంఘ (బీఎంఎస్) మద్దతు ప్రకటించింది.ఈ సందర్భంగా పరకాల ఆర్టీసీ డిపో వద్ద కార్మికులతో కలిసి సంఘీభావం వ్యక్తం చేశారు.రాష్ట్ర భవన నిర్మాణ విభాగ కార్యదర్శి అడ గాని జనార్దన్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కొందరు కార్మికులు తీవ్ర నిర్ణయాలకు వెళ్లే పరిస్థితులు ఏర్పడినట్లు తెలిపారు.కార్మికుల న్యాయమైన డిమాండ్లను చర్చల ద్వారా వెంటనే పరిష్కరించాలని,ఆర్టీసీని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.యూనియన్ల ఏర్పాటు హక్కులను గౌరవించాలని కూడా కోరారు.తెలంగాణలో ఇటీవల ఆర్టీసీ కార్మికులు చేసిన నిరసనలు ఆందోళనకర పరిస్థితులను సూచిస్తున్నాయని,ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశముందని హెచ్చరించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ప్రజలకు సేవలందించే కార్మికులకు తగిన గౌరవం,భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version