మే డే ను విజయవంతం చేయండి

మే డే ను విజయవంతం చేయండి

భూపాలపల్లి నేటిధాత్రి

మే1 డే ను
విజయవంతం చేయాలని సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో లక్షలాదిమంది కార్మికులు సంఘటిత, అసంఘటిత, ఉద్యోగ సేవారంగాలలో శ్రమజీవులుగా, చాలీ చాలని అతి తక్కువ వేతనాలు, జీతాలతో పని భద్రత లేకుండా 8 గంటల పని కన్నా అదనపు గంటలు యజమానులు చెప్పిన సమయం వరకు అదనపు శ్రమదోపిడికి గురి అవుతూ కాంట్రాక్టురంగా కార్మికులుగా కనీస వేతనాలు లేకుండా కార్మికులు మరింత పేదరికంలోకి మారి కుటుంబాల పోషణకు అప్పులు చేస్తూ జీవితాలు మరింత దుర్భరం గా మారుతున్నాయి. మేడే స్పూర్తితో పోరాడి చట్టబద్దంగా కార్మికహక్కులు సాధించుకుని, కార్మికులు అంటే బానిసలు కాదని, సంపదలో భాగస్వాములని ప్రభుత్వాల పెట్టుబడిదారుల నుండి శ్రమకు తగిన ఫలితం దక్కే వరకు పోరాడదమని పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప మేడే స్పూర్తితో 8గంటల పని దినాలను సాధించుకున్నాం. 2026 మేడే స్పూర్తితో 4 లేబర్ కోడ్స్ రద్దుకై పోరాడుదాం. శ్రమశక్తిని అందించే సమస్తరంగాల కార్మికులు చేసే శ్రమజీవుల రక్తం చెమటగా మారుస్తున్న కార్మికుల ఐక్యతలో బలం ఉంది.కార్మికుల హక్కుల కోసం నిరంతరం ఉద్యమం చేద్దామని ఆయన కోరారు.. వి సి కె పార్టీ యూత్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్ ఏఐసీసీ టు జిల్లా కార్యదర్శి కన్నూరు డానియల్… పార్టీ జిల్లా నాయకులు బంధు కాంతి సుజాత ఆత్కూరిశ్రీకాంత్ ఐసా రాష్ట్ర నాయకులు శిలపాక నరేష్ పాల్గొన్నారు

నాలుగు లేబర్ కోడ్ లను రాష్ట్రంలో అమలు చేయకూడదు

నాలుగు లేబర్ కోడ్ లను రాష్ట్రంలో అమలు చేయకూడదు

ఏఐఎఫ్ టి యు రాష్ట్ర నాయకుడు చంద్రగిరి శంకర్ డిమాండ్

భూపాలపల్లి నేటిధాత్రి

ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, సింగరేణిలో పెరిగిపోతున్న నేపథ్యంలో
సింగరేణి పరిరక్షణ పట్ల చిత్తశుద్ధి ఏ పాటిదో కార్మిక వర్గం అర్థం చేసుకోవచ్చు, అని ఏఐఎఫ్ టియు రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ చంద్రగిరి శంకర్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి బొగ్గు బ్లాక్ ల వేలం పాటలను వ్యతిరేకిస్తూ చిన్న సంఘాల ఆందోళన కార్యక్రమాలు చేస్తుండగా సి ఎం డి పిలుపునందుకొని సింగరేణి భవన్ కు చేరిన ఈ నాయకులు సింగరేణి భవిష్యత్తు, కొత్త గనులు పాత గనుల మూత లాంటి విషయాలతో స్టేటస్ రిపోర్టు చేతిలో పెడితే బసవన్న తలలూపి వచ్చిన ఈ జాతీయ సంఘాల నేతలు, తెలంగాణ డిప్యూటీ సీఎం కి సింగరేణి బొగ్గు గనుల వేలం పాటలకు వ్యతిరేకం కాదు అని ప్రత్యుత్తరాలు నడిపించుకున్న మహానటులు ఏఐటీయూసీ తో పాటు మిగతా కార్మిక సంఘం నాయకులు
ఈరోజు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక వర్గంపై చేస్తున్న దాడిని ఎదుర్కోవడానికి బలమైన కార్మిక ఉద్యమం అవసరమై ఉన్నది. చిన్న పెద్ద అనే ఈ గోలకు పోకుండా మిలిటెంట్ కార్మిక వర్గ పోరాటాలను నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా ఎన్ని పాలకవర్గ పార్టీలతో ఓట్లు సీట్లు పంచుకున్న పొత్తులు పెట్టుకున్న దేశవ్యాప్తంగా వస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను విధానాలను మార్పులను ఏఐటియుసి తోపాటు జాతీయ సంఘాలు ఇవి కూడా అడ్డుకోలేకపోయాయి అనేది వాస్తవ సత్యం.
రాష్ట్ర ప్రభుత్వం కూడా బేషరతుగా కేంద్ర ప్రభుత్వ బొగ్గు గనుల వేలం పాటలను రాష్ట్రంలో రద్దు చేయాలని, సింగరేణి ఎక్స్ప్లోరిషన్ చేసిన బొగ్గు నిక్షేపాలున్న అన్ని బ్లాక్ లను సింగరేణికి కేటాయించాలని డిమాండ్ చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నది. మరి ముఖ్యంగా రిజిస్టర్ కార్మిక సంఘాలను విడదీసి ఐక్య సంఘటన కు ప్రత్యక్షంగా జాతీయ కార్మిక సంఘాలు విభజించి పాలించు అనే చందంగా దోహద పడుతున్నాయి, కాబట్టి ఇప్పటికైనా రిజిస్టర్ కార్మిక సంఘాలు వారు భ్రమలకు లోను కాకుండా ఐక్యంగా కార్మికుల సమస్యల, పరిష్కారం కోసం పోరాటాలు చేయాల్సిన అవసరం ఆసన్నమైనది. కావున రిజిస్టర్ విప్లవ కార్మిక సంఘాలు ఒక తాటిపై ఉండి ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చిన చంద్రగిరి శంకర్ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version