మే డే ను విజయవంతం చేయండి

మే డే ను విజయవంతం చేయండి

భూపాలపల్లి నేటిధాత్రి

మే1 డే ను
విజయవంతం చేయాలని సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో లక్షలాదిమంది కార్మికులు సంఘటిత, అసంఘటిత, ఉద్యోగ సేవారంగాలలో శ్రమజీవులుగా, చాలీ చాలని అతి తక్కువ వేతనాలు, జీతాలతో పని భద్రత లేకుండా 8 గంటల పని కన్నా అదనపు గంటలు యజమానులు చెప్పిన సమయం వరకు అదనపు శ్రమదోపిడికి గురి అవుతూ కాంట్రాక్టురంగా కార్మికులుగా కనీస వేతనాలు లేకుండా కార్మికులు మరింత పేదరికంలోకి మారి కుటుంబాల పోషణకు అప్పులు చేస్తూ జీవితాలు మరింత దుర్భరం గా మారుతున్నాయి. మేడే స్పూర్తితో పోరాడి చట్టబద్దంగా కార్మికహక్కులు సాధించుకుని, కార్మికులు అంటే బానిసలు కాదని, సంపదలో భాగస్వాములని ప్రభుత్వాల పెట్టుబడిదారుల నుండి శ్రమకు తగిన ఫలితం దక్కే వరకు పోరాడదమని పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప మేడే స్పూర్తితో 8గంటల పని దినాలను సాధించుకున్నాం. 2026 మేడే స్పూర్తితో 4 లేబర్ కోడ్స్ రద్దుకై పోరాడుదాం. శ్రమశక్తిని అందించే సమస్తరంగాల కార్మికులు చేసే శ్రమజీవుల రక్తం చెమటగా మారుస్తున్న కార్మికుల ఐక్యతలో బలం ఉంది.కార్మికుల హక్కుల కోసం నిరంతరం ఉద్యమం చేద్దామని ఆయన కోరారు.. వి సి కె పార్టీ యూత్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్ ఏఐసీసీ టు జిల్లా కార్యదర్శి కన్నూరు డానియల్… పార్టీ జిల్లా నాయకులు బంధు కాంతి సుజాత ఆత్కూరిశ్రీకాంత్ ఐసా రాష్ట్ర నాయకులు శిలపాక నరేష్ పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version