కేంద్ర తెచ్చిన 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

కేంద్ర తెచ్చిన 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గడ్డం రమేష్

నర్సంపేట,నేటిధాత్రి:

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని, మున్సిపల్ కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గడ్డం రమేష్ అన్నారు. నర్సంపేట మున్సిపాలిటీ కార్మికుల ఆధ్వర్యంలో మేడే సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం రమేష్ మాట్లాడుతూ, అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకుని కార్మిక చట్టాలను రద్దుచేసి కార్పొరేట్ శక్తులకు యజమానులకు అనుగుణంగా లేబర్ కోడులను తీసుకువచ్చి దేశవ్యాప్తంగా అమలుకు పూనుకోవడం జరుగుతుందని ఇది కార్మిక వర్గానికి తీరని నష్టం అని పేర్కొన్నారు.మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలుకుతూ దేశ సంపదను,ప్రభుత్వ రంగ సంస్థలను వారికి ధారధత్తం చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ,ఔట్సోర్సింగ్, ఎన్ ఎం ఆర్, హరితహారం ఇంజనీరింగ్ వాటర్ వర్క్ స్ట్రీట్ లైటింగ్, పారిశుద్ధ కార్మికులు డ్రైవర్లు ఎలక్ట్రిషన్లు పంప్ ఆపరేటర్లు వర్క్ ఇన్స్పెక్టర్లు కంప్యూటర్ ఆపరేటర్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, శానిటరీ జవాన్లు అనేక సంవత్సరాలుగా పని చేస్తున్నారు వీరికి పని భద్రత లేదు వేతనాలు అమలు కావడం లేదు 1 పిఆర్సిసిలో సిఫారసును చేసిన కేటగిరీల వారిగా చెల్లించడం లేదనీ అన్నారు,
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కే రకమైన పనులు చేస్తున్న వారి మధ్య వేతన వ్యత్యాసాలు ఉండరాదని సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని తీర్పునిచ్చింది, కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ఓటుగా వాక్యాన్ని ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కోట్ల తీర్పు నామాలు చేయడం లేదు, ఒక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులకు 21000 వేలు చెల్లిస్తున్నారని , తెలంగాణ ధనిక రాష్ట్రంగా గొప్పలు చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నరని అన్నారు, మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని కార్మికుల పరిష్కరించాలని డిమాండ్ చేశారు, మేడే కార్మికుల దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకోవాలని, మున్సిపల్ కార్మికులందరూ మేడే వేడుకలో పాల్గొనాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో 10 వార్డ్ కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కోరబోయిన కుమారస్వామి, నాయకులు గడ్డమీది బాలకృష్ణ మున్సిపాలిటీ కార్మికులు అలువాల రాజు ,చిలుపాక యశోద హర్షం బుర్రిఉపేంద్ర మంద సువర్ణ ఆకుల పెళ్లి నీలమ్మ గుబల అనిత గూపెల్లి లావణ్య వసంత సానపల్లి లక్ష్మి బుర్రి ఉమా చామంతి మైసి నీల మైసి పద్మ డ్రైవర్స్ కర్జలశ్రీను తీటీ శ్రీనివాస్ నరసింహ రాములు అనీలు మధు శశి రాజేష్ నరసయ్య సదయ్య యాకూబ్ నీరటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

మే డే ను విజయవంతం చేయండి

మే డే ను విజయవంతం చేయండి

భూపాలపల్లి నేటిధాత్రి

మే1 డే ను
విజయవంతం చేయాలని సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో లక్షలాదిమంది కార్మికులు సంఘటిత, అసంఘటిత, ఉద్యోగ సేవారంగాలలో శ్రమజీవులుగా, చాలీ చాలని అతి తక్కువ వేతనాలు, జీతాలతో పని భద్రత లేకుండా 8 గంటల పని కన్నా అదనపు గంటలు యజమానులు చెప్పిన సమయం వరకు అదనపు శ్రమదోపిడికి గురి అవుతూ కాంట్రాక్టురంగా కార్మికులుగా కనీస వేతనాలు లేకుండా కార్మికులు మరింత పేదరికంలోకి మారి కుటుంబాల పోషణకు అప్పులు చేస్తూ జీవితాలు మరింత దుర్భరం గా మారుతున్నాయి. మేడే స్పూర్తితో పోరాడి చట్టబద్దంగా కార్మికహక్కులు సాధించుకుని, కార్మికులు అంటే బానిసలు కాదని, సంపదలో భాగస్వాములని ప్రభుత్వాల పెట్టుబడిదారుల నుండి శ్రమకు తగిన ఫలితం దక్కే వరకు పోరాడదమని పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంకెళ్లు తప్ప మేడే స్పూర్తితో 8గంటల పని దినాలను సాధించుకున్నాం. 2026 మేడే స్పూర్తితో 4 లేబర్ కోడ్స్ రద్దుకై పోరాడుదాం. శ్రమశక్తిని అందించే సమస్తరంగాల కార్మికులు చేసే శ్రమజీవుల రక్తం చెమటగా మారుస్తున్న కార్మికుల ఐక్యతలో బలం ఉంది.కార్మికుల హక్కుల కోసం నిరంతరం ఉద్యమం చేద్దామని ఆయన కోరారు.. వి సి కె పార్టీ యూత్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్ ఏఐసీసీ టు జిల్లా కార్యదర్శి కన్నూరు డానియల్… పార్టీ జిల్లా నాయకులు బంధు కాంతి సుజాత ఆత్కూరిశ్రీకాంత్ ఐసా రాష్ట్ర నాయకులు శిలపాక నరేష్ పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version