ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్….

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..

తంగళ్ళపల్లి మండలం .జిల్లెల్ల గ్రామంలోనీ. వ్యవసాయ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు .సర్పంచ్లకు. ప్రజా పాలన ప్రణాళికలో భాగంగా 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఈరోజు జిల్లెల్ల గ్రామ శివారులోని నూతనంగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిలకు సర్పంచులకు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విద్యాలయం జిల్లెల్ల కాన్ఫరెన్స్ హాలులో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని. ఇందులో భాగంగా ఈరోజు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగ్రవాల్ ఆధ్వర్యంలో. జ్యోతి వెలిగించి అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఈరోజు వ్యవసాయ కళాశాలలో మండలంలోని అలాగే మున్సిపల్ పరిధిలోని అధ్యక్షులు కౌన్సిలర్లు సర్పంచులు ప్రజా ప్రతినిధుల అందరికీ ప్రజా పరిపాలన ప్రణాళికలో భాగంగా ఒక్కరోజు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని. ఇందులో అనేక విషయాలపై పలు సమస్యలపై తెలుసుకోవడంతో పాటు గ్రామ పరిపాలనలో ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా .ఒడిడోడుకులకు. గురికాకుండా శిక్షణ కార్యక్రమంలో అన్ని విషయాలపై క్షుణ్ణంగా పరిశీలనలతోఅవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగ్రవాల్. జిల్లా .ఎస్పీ .మహేష్ బి.గితే. అదనపు .కలెక్టర్ .గడ్డం నగేష్. నూతనంగా ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు మున్సిపల్ అధ్యక్షులు గ్రామ సర్పంచ్లు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు

డ్రగ్స్‌కు నివారణ పై అవగాహన కార్యక్రమం.

డ్రగ్స్‌కు నివారణ పై అవగాహన కార్యక్రమం.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక

99 రోజుల కార్యక్రమంలో భాగంగా
అవగాహన కార్యక్రమం

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర EAGLE టీం డైరెక్టర్ శాందీప్ శ్యాండిల్య పర్యవేక్షణలో నిర్వహిస్తున్న పిల్లల భద్రత,డ్రగ్స్‌కు అడ్డుకట్ట కార్యక్రమంలో బాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈసందర్భంగా గురువారం రోజు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నటేష్ సిరిసిల్ల పట్టణ పరిధిలోని గీతానగర్ ప్రభుత్వ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించి,డ్రగ్స్ వల్ల కలిగే ప్రమాదాలు,వాటి దుష్పరిణామాలు,అలాగే పిల్లల భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ నటేష్ మాట్లాడుతూ..దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాల్సిన నేటితరం విద్యార్థులని,వారిని మాదకద్రవ్యాల మహమ్మారి నుండి కాపాడుకోవడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. విద్యార్థి దశ నుంచే డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని,విద్యార్థులు తమ శక్తిని క్రీడలు, విద్య మరియు ఇతర నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు మళ్లించుకోవాలని పిలుపునిచ్చారు.డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన EAGLE టీం సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఎక్కడైనా డ్రగ్స్ సరఫరా లేదా వినియోగం జరుగుతున్నట్లు సమాచారం ఉంటే భయపడకుండా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. డ్రగ్స్ వ్యాపారంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని,యువత భవిష్యత్తును కాపాడటమే పోలీస్ శాఖ మరియు EAGLE టీమ్‌ల ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

అధ్యక్షులను మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్ దంపతులు….

అధ్యక్షులను మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్ దంపతులు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బదనపల్లి.టెక్స్టైల్ పార్క్ ఇందిరానగర్ సర్పంచ్ గడ్డం మధుకర్ చోటు. అధ్యక్షులను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా మధుకర్ మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలంలో గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంగా గ్రామంలో గ్రామ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ గా గెలిపించి న గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ అన్న గారిని మర్యాదపూర్వకంగా కలిసి తమ గెలుపుకు సహకరించిన గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ వారికి గ్రామంలో ఉన్న అవసరాలను అభివృద్ధి పథంలో తీర్చిదిద్దాలనిఅధ్యక్షుల వారికి తెలియజేస్తూ వారిని కలవడం జరిగింది అలాగే తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు మా విజయానికి సంబంధించి మాకు గెలవడానికి తోడ్పాటు అందించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ముఖ్యంగా మా గెలుపునకు సహకరించిన కార్యకర్తలకు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మండల అధ్యక్షులు ప్రవీణ్ కి తెలియజేస్తూ. అధ్యక్షులును కలవడంతో పాటు రాబోయే రోజులలో మా గ్రామ సంబంధించిన కొన్ని విషయాలపై చర్చించి అభివృద్ధి పరచాలని అధ్యక్షులకు. తెలియజేయడంతో పాటు మమ్మల్ని దీవించి గ్రామ అభివృద్ధిలో మీ చేయూతని ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version