పీఆర్టీయు టీఎస్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ…
కేసముద్రం/ నేటి ధాత్రి
సెంటర్ లో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సంఘం కేసముద్రం మండల అధ్యక్షులు గోపాల శ్రీధర్ మాట్లాడుతూ..వెంటనే ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీ ప్రకటించాలని కోరారు.ఇప్పటికే చాలా కాలయాపన జరిగిందని, పీఆర్సీ సమయం దాటి రెండు సంవత్సరాలు గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని, ఇప్పటివరకు రావాల్సిన 5 డిఏ లను వెంటనే ప్రకటించాలని గోపాల శ్రీధర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా సంఘం కేసముద్రం మండల ప్రధాన కార్యదర్శి బీరం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ… ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం సత్వరమే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని,పెండింగ్ బిల్లులు, పీఆర్సీ ,ఇన్ సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహా యింపు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర,జిల్లా బాధ్యులు ఉపాధ్యాయులు శ్రీనివాస్, భాస్కర్, హరినాథ్, గోపాల్, రాహుల్ కుమార్, హరి సింగ్, సత్యనారా యణ,రఫీ భాష, శోభ, పద్మశ్రీ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
