వనపర్తలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లో దుకాణాలకు దరఖాస్తులు చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి జిల్లా కేంద్రంలో పాత మార్కెట్ యార్డ్ గణపతి దేవాలయం దగ్గర ఇంటి గ్రేటడ్ మార్కెట్ లో ప్రభుత్వం నిర్మించిన దుకాణాలకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఒక ప్రకటన లో కోరారు
సూపర్ మార్కెట్ బ్యాంక్వెట్ హాల్ లను, లాటరీ పద్ధతి ద్వారా కేటాయించనున్నట్లు కలెక్టర్ తెలిపారు లాటరీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పరిపాలన అధికారులు చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారుగ్రౌండ్ ఫ్లోర్‌లో మొత్తం 32 షాపులు అందుబాటులో ఉన్నాయని, బ్యాంక్, సూపర్ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్‌లో బ్యాంక్వెట్ హాల్ కూడా లాటరి ద్వారా కేటాయింపు ఉంటుందని కలెక్టర్ తెలిపారు.దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు 18-04-2026 సాయంత్రం 5.00 గంటల వరకు దరఖాస్తు ఫారం పొందడానికి ఫీజు .2,500 రూపాయలు నిర్ణయించబడిందిదరఖాస్తు ఫారం పొంది అప్లై చేసుకునేవారు దరఖాస్తు ఫారం తో పాటు డీ డీ ని సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు దుకాణాలకు రూ.15,000/-గా ఉండగా, బ్యాంక్వెట్ హాల్‌కు ఈఎండీ రూ.50,000/ బ్యాంక్ సూపర్ మార్కెట్‌కు ఈఎండీ రూ.25,000-గా నిర్ణయించబడిందని కలెక్టర్ తెలిపారు లాటరీ 21-04-2026 ఉదయం 11.00 గంటలకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రాంగణంలో నిర్వహించబడుతుందని ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ సూచించారు.
డిమాండ్ డ్రాఫ్ట్ సెక్రటరీ ఏ ఎం సి వనపర్తి పేరున తీసుకుని రావాలని కోరారు. షాపుల కేటాయింపు 32 షాపులలో జనరల్ కేటగిరి 16షాపులు, బి.సి కేటగిరి 08షాపులు, యస్.సి.కేటగిరి 05 షాపులు, యస్.టి కేటగిరి 02షాపు, మరియు పి.హెచ్.సీ కేటగిరి 1 మొత్తం 32 షాపులు కలవు లాటరీ పద్ధతి ద్వారాఉంటుందని కేటాయింపులో నిబంధనలు షరతుల ఇతర వివరముల కొరకు కార్యాలయపు పనివేలలో నేరుగా కాని లేదా సెల్ నెంబర్లు 7330733292 7893633678 ఫోన్ చేసి తెలిసుకొవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
