ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకునే బాధ్యత ఊరి ప్రజలది.

ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకునే బాధ్యత ఊరి ప్రజలది

రాత పుస్తకాలు అందజేసిన_మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి

నడికూడ నేటిధాత్రి:

 

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి పాఠశాల విద్యార్థిని,విద్యార్థులకు ప్రభుత్వము అందించిన ఉచిత రాత పుస్తకాలను అందజేశారు.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరము నుండి ఒకటవ తరగతి నుండి 5వ తరగతి చదివే విద్యార్థులకు ఉచితంగా రాత పుస్తకాలను అందజేస్తుందని అన్నారు.దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు,రాత పుస్తకాలు,మధ్యాహ్న భోజనం,రాగి జావా,వారానికి మూడుసార్లు కోడిగుడ్లు,అన్ని ఉచితంగా కల్పిస్తున్నది. కావున విద్యార్థిని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు పంపి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని,ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకునే బాధ్యత ఊరి గ్రామ ప్రజలది మరియు తల్లిదండ్రులదని అన్నారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఒకటవ తరగతికి మూడు,రెండవ తరగతి మూడు,మూడో తరగతి నాలుగు,నాలుగవ తరగతికి ఐదు,ఐదవ తరగతి ఆరు నోటుబుక్కులను ఉచితంగా అందజేసిందన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా నోట్బుక్కులు అందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్,ఉపాధ్యాయులు లకావత్ దేవా,కంచ రాజు కుమార్ మేకల సత్యపాల్, అంగన్వాడీ టీచర్స్ భీముడి లక్ష్మీ,నందిపాటి సంధ్య విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రజల కోసం శ్రమించే నిరంతర శ్రామికుడు రేవూరి.

ప్రజల కోసం శ్రమించే నిరంతర శ్రామికుడు రేవూరి.

⏩బి ఆర్ యస్. అసత్య ప్రచారాలు నమ్మదు.

⏩రాజకీయ స్వలాభం కోసం అమాయకులను బలిచేయద్దు.

⏩అర్హులైన వారికి విడతల వారిగా ఇందిరమ్మ ఇండ్లు.

⏩పేద ప్రజలకు అనునిత్యం అందుబాటులో కాంగ్రెస్ పార్టీ.

⏩మచ్చ లేని నాయకుడు రేవూరి.

దుపాకీ సంతోష్ కుమార్
16వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు

కాశిబుగ్గ నేటిధాత్రి

 

 

 

వరంగల్ నగరంలోని 16వ డివిజన్ పరిధిలోని గరీబ్ నగర్ బుధవారం రోజున బిఆర్ఎస్ నేతలకు స్థానిక కార్పొరేటర్ బిఆర్ఎస్ నాయకులు చేసిన అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ స్థానిక మహిళా వికలాంగురాలు లింగంపల్లి నిర్మల ఇంటిని సందర్శించి వారికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాన్ని అందించడం జరిగింది.

16వ డివిజన్ గరీబ్ నగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ దాసారాపు సారన్న ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో 16 డివిజన్ అధ్యక్షులు దుపాకి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు ఆలస్యం అవుతున్నాయని తెలుసుకున్న బిఆర్ఎస్ నాయకులు అదే అదునుగా చూసుకొని అమాయకురాలైన మహిళలను అడ్డుపెట్టుకొని వారి రాజకీయ స్వలాభం కోసం ప్రయత్నం చేస్తు బిఆర్ఎస్ నేతలు విఫలమయ్యారని అన్నారు.

గత బి ఆర్ యస్ పాలనలో చేసిన కమీషన్లకు, అక్రమాలకు పాల్పడిన వారు ప్రజా ప్రభుత్వం పై దుష్ప్రచారం చేయడానికి పూనుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్రమాలకు, అరాచకాలకు తావు లేకుండా, అభివృధే ధ్యేయంగా పని చేస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక,గరీబ్ నగర్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నేతలు అమాయకపు దళిత మహిళ వికలాంగురాలను చూపిస్తూ
బి ఆర్ యస్ పార్టీ రాజకీయ స్వలాభం కోసం అసత్య ప్రచారాలకు పాల్పడుతున్న టిఆర్ఎస్ నేతల మాటలను ఖండించారు.

ఇలాంటి ఉదంతాలను,అసత్య ప్రచారాలను గరీబ్ నగర్ ప్రజలు నమ్మద్దు అని,టోపీ పెట్టుకున్న నాయకులు వస్తున్నారు,మనకు టోపీ పెడుతారు జాగ్రత్త అని తెలిపారు.

గత బి ఆర్ యస్ ప్రభుత్వంలో ఇల్లు ఇవ్వకపోగా కనీసం ఒక తెల్ల రేషన్ కార్డు కూడా ఇచ్చిన పాపానపోలేదు అని ఎద్దేవ చేశారు.

ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం.

గరీబ్ నగర్ ప్రజలకు మాయమాటలు చెప్పి సుమారు 18 మంది ఇండ్లను కూలగొట్టి ఇల్లు ఇస్తాము అని, ఓట్ల కోసం రాజకీయం చేసిన పార్టీ బి ఆర్ యస్ పార్టీ అని,ఈ రోజు ప్రజా ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పై మాట్లాడే నైతిక హక్కు లేదు అని అన్నారు.

ఇందిరమ్మ ఇల్లు నియమ నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే దిశగా మన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి కృషి చేస్తున్నారని వారు తెలిపారు.

అంతేకాకుండా గరీబ్ నగర్ ప్రజలను మాయ మాటలతో మభ్యపెడుతూ, పది సంవత్సరాలు కాలయాపన చేసిన బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజల బాధలు, వారి గోడు వినకుండా ఇష్ట రాజ్యాంగ వ్యవహరించి భూ కబ్జాలకు,అక్రమాలకు పాల్పడి, ఇప్పుడు గరీబ్ నగర్ లో జరుగుతున్న అభివృద్ధిని చూసి మతిభ్రమించిన టిఆర్ఎస్ నాయకులు ప్రజాక్షేత్రంలోకి రావడానికి ఏ ఆధారంలేక అమాయక ప్రజలను మోసపరుస్తూ, తప్పుడు ప్రచారాలు చేస్తూ తిరగడం వారికి అలవాటైపోయిందని ఈ సందర్భంగా తెలియజేశారు.

వరంగల్ జిల్లాలోనే మచ్చలేని నాయకుడిగా సుధీర్గ రాజకీయ అనుభవం ఉన్న నేత పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పై తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదు అని, ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని తెలిపారు.

బి ఆర్ యస్ నాయకులు ఆకాశం పై ఉమ్మితే అది వారి మొఖం పై పడుతుందని వారు గ్రహించాలి అని అన్నారు.

ప్రజల శ్రేయస్సు కోసం నిరంతర శ్రామికుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి అని అన్నారు.

ఇందిరమ్మ ఇండ్లు లబ్దిదారుల ఎంపికలో పారదర్శకంగా, చిత్తశుద్ధితో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నారు.

ఏ ఒక్క లబ్ధిదారుల దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా స్థానిక శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి సలహాలు,సూచనలు తీసుకోని పనిచేస్తుందని తెలిపారు.

కావాలనే కాంగ్రెస్ పార్టీ పైన,కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన బిఆర్ఎస్ నాయకులు బురద చల్లుతున్నారు.ఏ ఒక్క లబ్ధిదారుడు దగ్గరైన డబ్బులు వసూలు చేసినట్టు రుజువు చేయిస్తే ఎంతటి శిక్షకైనా సిద్ధమేనని వారు అన్నారు.
బిఆర్ఎస్ నాయకులు బహిరంగ చర్చకు సిద్దామా అని హెచ్చరించారు.

పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు పంపిణీ జరుగుతుందని అర్హులైన ప్రతి ఒక్కరికి విడతలవారీగా ఇండ్లు వచ్చే విధంగా శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి చొరవ తీసుకుంటారని తెలిపారు.

గతంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి 93,95 సర్వే నెంబర్ల లో భూ అక్రమాలకు పాల్పడి గరీబ్ నగర్ లోని పేద ప్రజలకు వచ్చే స్థలాని వారి సహచరులకు,బినామీలకు కట్టబెట్టి గరీబ్ నగర్ ప్రజలకు సొంత ఇంటి స్థలము లేకుండా చేశారని గుర్తుచేశారు.

గరీబ్ నగర్ లోని సొంత ఇంటి లేని వారికి సర్వేనెంబర్ 93,95లో ఇల్లు ఇప్పిండం కోసం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాము అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు కొండేటి కొమరారెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లెం సుధాకర్,గరీబ్ నగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాసారపు సారన్న,ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెక్క లక్ష్మి, రమేష్, అఫ్రీన్,అంకేశ్వరపు రాజు,పిట్టల అనిల్, గ్రామ పార్టీ అధ్యక్షులు జానీ,హుజూర్,కీర్తి నగర్ ఇందిరమ్మ ఇండ్ల కమిటీ మెంబర్ పోతునూరీ మౌనిక, జన్ను రాజు,మార్త రాజశేఖర్, గుర్రం వెంకటేశ్వర్లు, పరకాల యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వల్లెం సాయి కుమార్, గొట్టిముక్కుల పరిపూర్ణ చారి గుర్రపు వెంకటేశ్వర్లు శివరాత్రి పెద్ద వెంకన్న. కృష్ణ, పోలేబోయిన శివ, బిర్రు ప్రసాద్, కె.మోహన్, జన్ను రాజు తక్కల్లపల్లి రాజశేఖర్,నూరుజహాన్,గొర్రె కరుణాకర్,ఐత అశోక్, జన్ను కళ్యాణ్, భరద్వాజ్. శివరాత్రి చిన్న వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకోసం శ్రమించే నిరంతర శ్రామికుడు రేవూరి.

ప్రజలకోసం శ్రమించే నిరంతర శ్రామికుడు రేవూరి.
:-గరీభ్ నగర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.

బి.ఆర్.యస్. అసత్య ప్రచారాలు నమ్మదు. రాజకీయ స్వలాభం కోసం అమాయకులను బలిచేయద్దు.

అర్హులైన వారికి విడతల వారిగా ఇందిరమ్మ ఇండ్లు. పేద ప్రజలకు అనునిత్యం అందుబాటులో కాంగ్రెస్ పార్టీ.

గొర్రెకుంట నేటిధాత్రి:

 

వరంగల్ నగరంలోని, 16వ డివిజన్ పరిధిలో గరీబ్ నగర్ నందు, నిన్న కొందరు బిఆర్ఎస్ నేతలు, స్థానిక కార్పొరేటర్ చేసిన అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ స్థానిక మహిళా వికలాంగురాలు లింగంపల్లి నిర్మల ఇంటిని సందర్శించి, వారికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాని అందించిన 16వ డివిజన్, గరీబ్ నగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నేతలు. దాసారపు సారన్న ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో 16 డివిజన్ అధ్యక్షులు దుపాకి సంతోష్ కుమార్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు ఆలస్యం అవుతున్నాయని తెలుసుకున్న టిఆర్ఎస్ నాయకులు అదే అదునుగా చూసుకొని అమాయకురాలైన మహిళలను ముందు పెట్టి వారి రాజకీయ స్వలాభం కోసం ప్రయత్నం చేస్తు టిఆర్ఎస్ నేతలు విఫలమయ్యారు అని అన్నారు. గత బి.ఆర్.యస్ పాలనలో తీసుకున్న కమిషన్లకు, అక్రమాలకు పాల్పడిన వారు ప్రజా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడానికి పూనుకున్నారు అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్రమాలకు, అరాచకాలకు తావు లేకుండా అభివృధే ధ్యేయంగా పని చేస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక గరీబ్ నగర్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నేతలు అమాయకపు దళిత మహిళ వికలాంగురాలను చూపిస్తూ బి ఆర్ యస్ పార్టీ రాజకీయ స్వలాభం కోసం అసత్య ప్రచారాలకు పాల్పడుతున్న టిఆర్ఎస్ నేతల మాటలను ఖండించారు. ఇలాంటి ఉదంతాలను అసత్య ప్రచారాలను గరీబ్ నగర్ ప్రజలు నమ్మదు, టోపీ నాయకులు వస్తున్నారు మనకు టోపీ పెడుతారు జాగ్రత్త అని తెలిపారు. గత బి.ఆర్.యస్ ప్రభుత్వంలో ఇల్లు ఇవ్వకపోగా కనీసం ఒక తెల్ల రేషన్ కార్డు కూడా ఇచ్చిన పాపనపోలేదు. ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం. గరీబ్ నగర్ ప్రజలకు మాయమాటలు చెప్పి సుమారు 18 మంది ఇండ్లను కూలగొట్టి ఇల్లు ఇస్తాము అని ఓట్ల కోసం రాజకీయం చేసిన పార్టీ బి ఆర్ యస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. ఈ రోజు ప్రజాప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్లపై మాట్లాడే నైతిక హక్కు లేదు అని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు నియమ నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే దిశగా మన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి కృషి చేస్తారని వారు తెలిపారు. అంతేకాకుండా గరీబ్ నగర్ ప్రజలను మాయ మాటలతో మభ్యపెడుతూ పది సంవత్సరాలు కాలయాపన చేసిన బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజల బాధలు వారి గోడు వినకుండా ఇష్ట రాజ్యాంగ వ్యవహరించి భూకబ్జాలకు, అక్రమాలకు పాల్పడి ఇప్పుడు గరీబ్ నగర్ లో జరుగుతున్న అభివృద్ధిని చూసి మతిభ్రమించిన టిఆర్ఎస్ నాయకులు ప్రజాక్షేత్రంలోకి రావడానికి ఏ ఆధారం లేక, అమాయక ప్రజలను మోసపరుస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తూ తిరగడం వారికి అలవాటైపోయింది అని అన్నారు. వరంగల్ జిల్లాలోనే మచ్చలేని నాయకుడిగా సుధీర్గ రాజకీయ అనుభవం ఉన్న నేత పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పై తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదు అని, ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని తెలిపారు. బి ఆర్ యస్ నాయకులు ఆకాశంపై ఉమ్మితే అది వారి మొఖంపై పడుతుంది అని వారు గ్రహించాలి అని అన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం నిరంతర శ్రామికుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి అని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు లబ్దిదారుల ఎంపికలో పారదర్శకంగా చిత్తశుద్ధితో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నారు, ఏ ఒక్క లబ్ధిదారుల దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా స్థానిక శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి సలహాలు సూచనలు తీసుకోని పనిచేస్తుందని తెలిపారు. కావాలనే కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన బి.ఆర్ఎస్ నాయకులు బురద చల్లుతున్నారు. ఏ ఒక్క లబ్ధిదారుడు దగ్గరైన డబ్బులు వసూలు చేసినట్టు రుజువు చేయిస్తే ఎంతటి శిక్షకైనా సిద్ధమేనని వారు అన్నారు. బి. ఆర్. యస్ నాయకులు మీరు బహిరంగ చర్చకు సిద్దామా అని అన్నారు. పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు పంపిణీ జరుగుతుందని అర్హులైన ప్రతి ఒక్కరికి విడతలవారీగా ఇండ్లు వచ్చే విధంగా స్థానిక శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి చొరవ తీసుకుంటారని తెలిపారు. గతంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి 93, 95 సర్వే నెంబర్ల లో భూ అక్రమాలకు పాల్పడి గరీబ్ నగర్ లోని పేద ప్రజలకు వచ్చే స్థలాని వారి సహచరులకు, బినామీలకు కట్టబెట్టి గరీబ్ నగర్ ప్రజలకు సొంత ఇంటి స్థలము లేకుండా చేసారు. గరీబ్ నగర్ లోని సొంత ఇంటి లేని వారికి సర్వేనెంబర్ 93 95లో ఇల్లు ఇప్పిండం కోసం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాము అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు కొండేటి కొమర రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లెం సుధాకర్, గరీబ్ నగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాసారపు సారన్న, ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెక్కలక్ష్మి రమేష్, అఫ్రీన్, అంకేశ్వరపు రాజు, పిట్టల అనిల్, గ్రామ పార్టీ అధ్యక్షులు జానీ, హుజూర్, జన్ను రాజు, మార్త రాజశేఖర్, గుర్రం వెంకటేశ్వర్లు, పరకాల యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వల్లెం సాయి కుమార్, గొట్టిముక్కుల పరిపూర్ణ చారి, గుర్రపు వెంకటేశ్వర్లు, శివరాత్రి పెద్ద వెంకన్న, కృష్ణ, పోలేబోయిన శివ, బిర్రు ప్రసాద్, కె.మోహన్, జన్ను రాజు, తక్కల్లపల్లి రాజశేఖర్, నూరూజహాన్, గొర్రె కరుణాకర్, ఐత అశోక్, జన్ను కళ్యాణ్, భరద్వాజ్. శివరాత్రి చిన్న వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

ఇందిరా మహిళా శక్తి చీరలతో సిరిసిల్ల ప్రజలకు చేతినిండా ఉపాధి.

ఇందిరా మహిళా శక్తి చీరలతో సిరిసిల్ల ప్రజలకు చేతినిండా ఉపాధి

బతుకమ్మ చీరల బకాయిలు 280 కోట్లు చెల్లించాం

రూ. 50 కోట్లతో యార్న్ బ్యాంకు ఏర్పాటు

ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
చేనేత జౌళి, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్

సిరిసిల్ల టౌన్( నేటిధాత్రి ):

shine junior college

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికులకు ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తితో చేతినిండా పని కల్పిస్తున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. సిరిసిల్లలోని గణేష్ నగర్ లో ఉన్న మామిడాల నారాయణ, కొండ సుభాష్ కు మరమగ్గాల యూనిట్లను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చేనేత జౌళి, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అధికారులతో కలిసి ఈ రోజు చీరల ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు కార్మికులతో మాట్లాడారు. వేముల శ్రీనివాస్, మెరుగు శ్రీనివాస్ తదితర కార్మికులతో ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్ మాట్లాడారు. ప్రతి రోజు ఎన్ని మీటర్ల చీర ఉత్పత్తి చేస్తున్నారని? వారానికి ఎంత ఆదాయం వస్తుందని? అడిగి తెలుసుకున్నారు. చీరల ఉత్పత్తిలో ఏమైనా ఇబ్బంది ఎదురవుతున్నాయని ఆరా తీశారు. తమకు ప్రతివారం రూపాయలు 4000 నుంచి 5000 వరకు ఆదాయం వస్తుందని కార్మికులు వారి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి, కార్మికులను ఆదుకునేందుకు చేతినిండా పని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని వివరించారు. ఇందులో భాగంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఇందిరా మహిళ శక్తి కింద చీరల ఉత్పత్తి ఆర్డర్లు అందించామని తెలిపారు.
కార్మికులు, ఆసాములు కోరిన విధంగా ధర నిర్ణయించామని వెల్లడించారు.

ఇందిరా మహిళా శక్తి చీరలతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని కార్మికులు, ఆసాములకు దాదాపు 8 నెలల పాటు ఉపాధి లభిస్తుందని తెలిపారు. గతంలోని బతుకమ్మ చీరల బకాయిలు దాదాపు 280 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా దశాబ్దాల కల నెరవేరుస్తూ వేములవాడలో రూపాయలు 50 కోట్లతో యార్న్ బ్యాంకు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అవసరమైన యార్న్ అంతా అక్కడ అందుబాటులో పెడుతున్నామని తెలిపారు. ఇతర ప్రభుత్వ శాఖ ఆర్డర్లు సిరిసిల్లకు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో కార్మికులు ఉపాధి లేక ఇబ్బంది పడేవారు అని ఇప్పుడు చేతినిండా పని ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఆర్డర్లను ఆసాములు, కార్మికులు సద్వినియోగం చేసుకొని వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. సెస్ పరిధిలోని బ్యాక్ బిల్లింగ్ సమస్య కోర్టు పరిధిలో ఉందని దానిపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇతర మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్,
చేనేత జౌళి, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్,కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, గ్రంధాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్,
మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప రెడ్డి, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఏడీ రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

పరకాల నేటిధాత్రి

 

 

 

Shine Junior Colleges

మున్సిపాలిటీ పరిధిలోని రెండోవార్డ్ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు బొచ్చు అనూష దశ్వంత్ రెండో వార్డులో ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ అనంతరం కొబ్బరికాయ కొట్టి ఇల్లు నిర్మాణం కోసం ముగ్గు పోసి ప్రారంభించారు.గత పది సంవత్సరాలుగా ఏ ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయని గత ప్రభుత్వం కేవలం అసమర్థ పాలన కొనసాగించినదని,కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజా సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలను ఆదుకునే రీతిలో నడిపిస్తున్నదని తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కట్టుకుని బాగుపడాలని అర్హులైన వారికి ఇండ్లు l మంజురు చేసి వారిని ఆదుకునే రీతిలో ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి పరకాల మండల ఎస్సీ విభాగం అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి,ఇందిరమ్మ కమిటీ సభ్యులు మడికొండ కవిత చంగల్ రావు, మడికొండ లలిత,బొచ్చు అనిల్,కాంగ్రెస్ నాయకులు బొచ్చు సంపత్,ఏం డి,హాజీ చుక్క శాంతి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.

రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

తహసీల్దార్ రజిత

వీణవంక, ( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి :

 

 

 

 

 

వీణవంక మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సు ను భూ సమస్యలు ఉన్న వారు ప్రతి ఒక్కరూ సద్వినియోగం కోవాలి అని ముఖ్య అతిథిగా వచ్చిన తహసీల్దార్ రజిత అన్నారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని అనంతరం దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భూ సమస్యలను పరిశీలించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. భూ రికార్డుల్లో పేర్లు తప్పులు విస్తీర్ణం భూమి ఎక్కువ తక్కువ ఉన్న, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేదిత జాబితాలోఉన్న

భూ సమస్యలు, సర్వే నంబర్ లేకపోవడం, పట్టా పాస్ బుక్ లు లేకపోవడం, ఒక్కరి భూమి మరొకరి మీద పట్టాకు ఎక్కినటువంటి సర్వే నంబర్లను సరిచేసి పాత రికార్డు ప్రకారం పరిశీలించి సరి చేయడం సాదా బైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్ బి లో చేర్చిన భూముల సమస్యలు, భూ సేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబందించిన దరఖాస్తులు సదస్సులో స్వీకరించి భూ భారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ ప్రక్రియ పూర్తి చేస్తా మని అన్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తిగా క్షేత్రస్థాయి పరిశీలన ఉంటుందని అన్నారు. డిప్యూటీ తహసీల్దార్ నిజాముద్దీన్ రెవెన్యూ సిబ్బంది ఈ కార్యక్రమంలో టి టిపి సి సి నెంబర్ కర్ర భగవాన్ రెడ్డి, ఇల్లంతకుంట టెంపుల్ ధర్మకర్త జున్నుతుల మధుకర్ రెడ్డి, యూత్ నాయకులు హరీష్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు నాగరాజు, బండి మహేష్, అనిల్ రెడ్డి తదితరులు  పాల్గొన్నారు.

ప్రజా హృదయంలో ఉన్న ప్రజా నాయకుడు ఉజ్వలుడు.

ప్రజా హృదయంలో ఉన్న ప్రజా నాయకుడు ఉజ్వలుడు….

◆: వృత్తి రీత్యా వైద్యుడైన పేద ప్రజలకు పెన్నిధి…

◆: ఇటీవలే కోట్లు ఖర్చు చేస్తూ త్రాగునీటి సౌకర్యాలు పేద ప్రజల వైద్య ఖర్చులు భరిస్తూ…

◆: ప్రజల్లోనే నిరంతరం ఉండే నాయకుడు….

◆:ప్రజలకు నేనున్నాని భరోసా కలిపించే హృదయ నాయకుడు…

◆:సీనియర్ నాయకులు ఉజ్వల రెడ్డి పనితీరుపై ప్రశంసలు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉజ్వల రెడ్డి పనితీరుపై జహీరాబాద్ నియోజకవర్గ ఆయా మండలాల. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి చేసిన ఈ సర్వేలో ఆయన ముందువరుసలో ఉండడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.నియోజకవర్గంలోని ఆయా గ్రామాల అవసరాలకనుగుణంగా ప్రణాళికాబద్ధంగా అనేక తన సొంత డబ్బు ఖర్చుతో అభివృద్ధి పనులు చేయడం, ప్రతి ఒకరికీ చేరువై ప్రజా నాయకుడిగా ముద్రవేసుకోవడం వంటి అంశాలు ఆయనకు ఈ గుర్తింపు తీసుకొచ్చినట్లు గ్రామ ప్రజలు పేర్కొన్నది. అంతేగాక ప్రజల హృదయాలను గెలుచుకున్న నేతగా.. చెప్పినప్పుడే పనిచేసి చూపడంలో ముందుండే కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉజ్వల రెడ్డి ముందు సమస్య వచ్చిన ప్రతి సందర్భంలో అందుబాటులో ఉండడం, ప్రజలతో నిత్యం అనుసంధానంగా ఉండడం ఆయనకు విశేషమైన విశ్వాసాన్ని తీసుకొచ్చింది. ప్రజల మద్దతే తనకు ప్రధాన బలమని.. ఈ సర్వే ర్యాంకింగ్‌ ద్వారా మళ్లీ రుజువు అయిందని తెలిపారు.పనితీరు బాగుందని రావడం సంతోషం.నిదర్శనం. కేవలం పనితీరే కాకుండా ప్రజల కోసం నిత్యం పాటుపడే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది అనేక గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తూ ప్రజల ఆరోగ్యం బాగుండాలని తన సొంత ఖర్చుతో ఆసుపత్రిలో ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడం గొప్ప విషయం. ఇలాంటి నాయకుడు జహీరాబాద్ ప్రజలకు దొరకడం అదృష్టం. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే ఆయన.. మరింత సేవ చేసి మొదటి స్థానం సాధించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం జాబితాల్లో అనర్హుల పేర్లు ఉంటే తొలగిస్తాం.

ఇందిరమ్మ ఇళ్ల పథకం జాబితాల్లో అనర్హుల పేర్లు ఉంటే తొలగిస్తాం

-ప్రతీ పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం

-కొర్కిశాలలో భూ భారతి అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్

-మొట్లపల్లి, పిడిసిల్ల, రంగాపురం గ్రామాల్లో పల్లె దవాఖానాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

-గుండ్లకర్తి గ్రామంలో జీపీ బిల్డింగ్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

-పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే

-మొగుళ్ళపల్లి మండలంలో వివిధ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన, లబ్దిదారులకు మంజూరీ పత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్

మొగులపల్లి నేటి ధాత్రి

 

 

 

 

ఇందిరమ్మ ఇళ్ల పథకం జాబితాల్లో అనర్హుల పేర్లు ఉంటే తొలగిస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.

మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్ళపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటించారు.

మొగుళ్ళపల్లి మండల కేంద్రంతో పాటు ఇప్పలపల్లి, పోతుగల్, కొర్కిశాల, గణేష్ పల్లి, పెద్దకోమటిపల్లి, పర్లపల్లి, మొట్లపల్లి, గుండ్లకర్తి, మెట్టుపల్లి, నర్సింగాపూర్, వేములపల్లి, బంగ్లాపల్లి, ఎల్లారెడ్డిపల్లి, పిడిసిల్ల, ముల్కలపల్లి, ఇస్సిపేట, పాత ఇస్సిపేట, వాగొడ్డుపల్లి, చింతలపల్లి, రంగాపురం గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు.

అనంతరం ఆయా గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంజూరీ పత్రాలను జిల్లా అదనపు కలెక్టర్, జడ్పీ సీఈవో విజయలక్ష్మీ, జిల్లా హౌసింగ్ పీడీ లోకీలాల్, ఎంపీడీఓ, ఎమ్మార్వోలతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు.

కొర్కిశాలలో భూ భారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. అనంతరం పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.

మొట్లపల్లి, పిడిసిల్ల, రంగాపురం గ్రామాల్లో పల్లె దవాఖానాలను ప్రారంభించారు. గుండ్లకర్తి గ్రామంలో జీపీ బిల్డింగ్ కు శంకుస్థాపన చేశారు.

మొగుళ్ళపల్లిలో అంగన్వాడీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాలల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ..

పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే వారి నుంచి వచ్చే స్పందన బాగుంటుందన్నారు.

గుడిసెలో ఉంటున్న నిరుపేదలకు మొదటి విడతలో ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేస్తుందన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పథకం పారదర్శకంగా అమలు చేయాలని, ఎక్కడ లంచాలకు ఆస్కారం లేకుండా ఇండ్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

రాజకీయపార్టీలకు అతీతంగా పేద, నిరుపేదలకు మొదటి విడతలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.

ప్రభుత్వం పెట్టే ప్రతీ రూపాయి కూడా పేదలకు ఉపయోగపడాలని తాము ప్రయత్నిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పీఏసీఎస్ మొగుళ్ళపల్లి మాజీ చైర్మన్ ఫోలీనేని లింగారావు, పీఏసీస్ మొగుళ్ళపల్లి వైస్ చైర్మన్ కొమురోజు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు తక్కల్లపల్లి రాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మంద సాంబయ్య, కేతిపల్లి తిరుపతిరెడ్డి, రొంటాల సంపత్, చర్లపల్లి శ్రీధర్ గౌడ్, క్యాతరాజు లింగమూర్తి, పొన్నాల విజయేందర్ రెడ్డి, ఎలేటి శివారెడ్డి, పడిదల ప్రకాష్ రావు, మల్సాని రాజేశ్వర్ రావు తదితరులున్నారు.

తాహసిల్దార్ కు గౌడ కులస్తుల సన్మానం.

తాహసిల్దార్ కు గౌడ కులస్తుల సన్మానం

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

 

 

మండల కేంద్రంలోని మండల తాహసిల్దార్ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బిఎస్ఎస్ వరప్రసాద్ ను గౌడ కులస్తులు సాల్వతో ఘనంగా సత్కరించారు. గ్రామాల్లో నెలకొన్న గౌడ కులస్తుల సమస్యలను తాహసిల్దార్ కు వివరించారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలో ఏ గ్రామంలో నైతే గౌడ కులస్తులకు ఐదు ఎకరాల భూమి లేదు వాటిని గుర్తించి వారికి అందజేయాలని విజ్ఞప్తి చేశారు. భూ సమస్యలు నెలకొన్న వాటిని భూభారతిలో పరిష్కారం చేసి గౌడ కులస్తుకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా నాయకులు చెట్ల చంద్రశేఖర్ గౌడ్, చర్ల పళ్లి సత్యనారాయణ గౌడ్, సీనియర్ న్యాయవాది కట్ట నరస గౌడ్ మండల నాయకులు నేరెళ్ల సుభాష్ గౌడ్, భూసారపు సాయిరాం గౌడ్, కట్ట ఆంజనేయులు గౌడ్ పలు గ్రామాల గౌడ సంఘాల నాయకులు, ఎలుక అశోక్ గౌడ్, కుంట రాజగౌడ్, గంగా నరసయ్య గౌడ్, రాంప్రసాద్ గౌడ్, నారాయణ గౌడ్, రాజేశ్వర్గౌడ్, శంకర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రామ్ కిషన్ గౌడ్, రఘు గౌడ్, అంజయ్య గౌడ్, రాములు, కిషన్ తదితరులు పాల్గొన్నారు.

చివరి శ్వాస వరకు ప్రజలకు సేవ చేస్తాను.

చివరి శ్వాస వరకు చొప్పదండి నియోజకవర్గం ప్రజలకు సేవ చేస్తాను

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందజేస్తాం

పేదవారి సొంత ఇంటి కలలు నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది

రాష్ట్రంలో 99 శాతం మందికి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది

రూ. 43 కోట్లతో నారాయణపూర్ రిజర్వాయర్ పెండింగ్ పనులు పూర్తి చేస్తాము

గంగాధర మండలంలోని 33 గ్రామాలకు చెందిన 721 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ ప్రమేలా సత్పతితో కలిసి మంజూరి పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

గంగాధర నేటిధాత్రి:

 

 

 

 

 

పేదవారి సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది.

ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, ఒక్క గంగాధర మండలంలోనే 721 మంది అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాము.

721 మందికే కాదు, చొప్పదండి నియోజకవర్గం లోని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరి చేయడానికి కృషి చేస్తాము.

గత బిఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అందజేశారు.

రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తాము.

సంక్షేమ పథకాల పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎవరైనా మామూలు అడిగితే మా దృష్టికి తీసుకురండి, లేదా పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయండి.

సంక్షేమ పథకాలు అందించడంలో అవినీతికి తావు లేదు.

మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం.

జ్యోతి పథకంతో 200 మీట్ల వరకు ఉచిత విద్యుత్ను అందజేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.

గత బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెట్టింది.

కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం 44 కిలోల వరకు తూకం వేసి రైతులను నిండా ముంచింది.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ గ్రామ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో 21 వేల కోట్ల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.

గంగాధర మండలంలో 2018 లో బిఆర్ఎస్ ప్రభుత్వం 2483 మంది రైతులకు రూ.17 కోట్ల 82 లక్షల రుణమాఫీ చేస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5744 మంది రైతులకు రూ. 48 కోట్ల రుణమాఫీ చేసింది.

బిఆర్ఎస్, బిజెపి పార్టీల నాయకులు రుణమాఫీ కాలేదని ప్రజలను మభ్యపెడుతున్నారు. 20 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న నారాయణపూర్ రిజర్వాయర్ పెండింగ్ పనులను పూర్తి చేయడానికి రూ.43 కోట్లతో పూర్తి చేయబోతున్నాము.

గత బిఆర్ఎస్ ప్రభుత్వం లోని ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రారంభించి వదిలేసిన ఓటీల నిర్మాణాల పనులను పూర్తి చేయిస్తున్నాం.

నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేసి కోనసీమగా మార్చుతాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 56 వేల ఉద్యోగాలను భర్తీ చేసింది.

కుల మతాలతో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ప్రతి నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది.

అతి త్వరలోనే గంగాధర మండలంలో డిగ్రీ కళాశాలను  ప్రారంభిస్తాము.

చినుకు పడితే ప్రజలకు కష్టాలే.

చినుకు పడితే ప్రజలకు కష్టాలే

బాలానగర్  నేటి ధాత్రి:

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు వీధుల్లో సీసీ రోడ్డు లేకపోవడంతో మట్టి రోడ్డు గుంతలమయంగా మారింది. దీంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆటో స్టాండ్ సమీపంలో వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ప్రతినిత్యం ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి సీసీ రోడ్డు నిర్మించాలని మండల కేంద్రం ప్రజలు కోరారు.

అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.

అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ఆదివారం సాయంత్రం 5.00 గంటలకు డిఎస్పి సైదా నాయక్ మరియు ఇన్స్పెక్టర్ శివ లింగం ఆదేశాల మేరకు నేషనల్ హైవే-65 మీద ప్రిన్స్ ధాబ ముందర వాహనాలు తనికి చేస్తుండగా ఒక బ్లూ కలర్ ఆక్టివా మోటార్ సైకిల్ మీద ఇద్దరు వ్యక్తులు బీదర్ వైపు నుండి హైదరాబాద్ కు అక్రమంగా ఎండు గంజాయి ని తరలిస్తుండగా పట్టుకున్నాము ఆ ఇద్దరు వ్యక్తులు పేర్లు తెలుసుకొనగా1) షైక్ సల్మాన్ తండ్రి జబ్బార్ హైదరాబాద్ 2) మహమ్మద్ మొయిజుద్దీన్ తండ్రి సమీఉద్దీన్ హైదరాబాద్ ని తెలిపినారు వీరు ఇద్దరు బీదర్ లో ఇరానీ గల్లీలో గంజాయిని తక్కువ రేట్ కి కొనుగోలు చేసి హైదరాబాద్ లో ఎక్కువరేట్ కు అమ్ముకొనుటకు తీసుకుని వెళ్తుండగా పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన తరువాత మెజిస్ట్రేట్ గారి ముందు హాజరు పరిస్తామన్నారు.

ఆశయాలను భావజాలాన్ని గ్రామాల్లో ప్రజలకు తెలియజేయాలి.

మహానీయుల ఆశయాలను భావజాలాన్ని గ్రామాల్లో ప్రజలకు తెలియజేయాలి

రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

దేశ వ్యాప్తంగా దళితులపై మహిళలపై జరుగుతున్న సంఘటనలు అరికట్టుటలో కేంద్ర రాష్ట్రప్రభుత్వాలువిఫలమైనాయని వాటిని ఎదుర్కోవడానికి మరియు*అంబేద్కర్ పాటు మహానీయుల ఆశయాలను భావజాలాన్ని* ముందుకు తీసుకెళ్లడానికి అంబేద్కర్ యువజన సంఘాలను బలోపేతం చేయాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య అన్నారు.
గురువారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళ పెల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు మంగళ పెళ్లి శ్రీనివాస్ అద్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య మాట్లాడారు .భారత దేశంలోని అన్ని వర్గాల ప్రజల చీకటి బ్రతుకులో వెలుగులు నింపిన మహానీయుడు బాబా సాహెబ్ అంబేద్కర్ అన్నారు. దేశంలో ఉన్నత చదువులు చదివిన ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అంటరాని తనం ను ఎదుర్కోని పట్టుదలతో భవిష్యత్తు తరాల ప్రజల కోసం సమాన హక్కులను కల్పిస్తూ అందరికీ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం రిజర్వేషన్లు ఓటు హక్కును కల్పించారన్నారు. పల్లెల్లో ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి తో పాటు మహనీయుల ఆశయాలను సిద్ధాంతాలను ఆలోచనలు ప్రజలకు తెలియ పరువాలని అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 31 వరకు గ్రామ గ్రామాన అంబేద్కర్ యువజన సంఘాలను ఏర్పాటు చేసి బలోపేతం చేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో అంబేద్కర్ యువజన సంఘం చిట్యాల మండల కోశాధికారి కనకం తిరుపతి జిల్లా నాయకులు బండార్ రాజు, దొమ్మటి ఓదెలు, బొచ్చు నరసయ్య, సంపత్, సదానందం, భూమి రెడ్డి, సుమంత్, తదితరులు పాల్గొన్నారు

కొత్తవారిని పరిచయం చేసే మన ఆప్తమిత్రుడు టీ.

శీర్షిక

హైదరాబాద్ నేటి ధాత్రి:

అందరిప్రియనేస్తం టీ”(తేనీరు)
ప్రాంతాలకు అతీతంగా…
కొత్తవారిని పరిచయం చేసే మన ఆప్తమిత్రుడు టీ..!
మస్తిష్కంలోని సమస్యలతో సతమతమౌతుంటే
అమ్మ చేతి స్పర్శలా మనసుకు ఉపశమనం కల్పించే
మన ఆప్తమిత్రుడు టీ ..!
ప్రతి విద్యార్థి కనురెప్పలపై దాడిచేస్తున్న నిద్దురను
తరిమేస్తూ చదువుల్లో సహకరించు మన నేస్తం టీ ..!
దేశ సరిహద్దుల్లో మంచుకొండల్లో పహారా కాస్తున్న
సైనికులకు ఆపద్బాంధవుడులా నేనున్నా నంటూ
వెచ్చగా గొంతులోకిజారిపోతూ…
నూతనోత్తేజం అందించు మన ఆప్తమిత్రుడు టీ ..!
అమీరు గరీబు అనే తారతమ్యం లేక
అందరినీ ఉషోదయ వేళ పలుకరిస్తూ ..
జోష్ నింపే మన అమృత నేస్తం టీ ..!
పున్నమి వెన్నెల రేయిలో సన్నగా వీచే చల్లగాలిలో
మదిలో మరుగున పడిన జ్ఞాపకాల మమతలను
గుర్తుకు తెచ్చే మన ఆప్తమిత్రుడు టీ ..!
మనం ముద్దుగా పిలుచుకునే”టీ”(తేనీరు)..
మనందరికీప్రియనేస్తం.మీకు ప్రశాంతమైన మరియు రుచికరమైన అంతర్జాతీయ టీ దినోత్సవ మే 21 శుభాకాంక్షలతో…
రచన: శ్రీమతి మంజుల పత్తిపాటి (కవయిత్రి).
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.
యాదాద్రి భువనగిరి జిల్లా,
తెలంగాణ రాష్ట్రం.
చరవాణి 9347042218.

శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం గ్రామ ప్రజలపై ఉండాలి.

శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం గ్రామ ప్రజలపై ఉండాలి..

#ఘనంగా శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం.

#దేవాలయ స్థల దాతకు ఘన సన్మానం .

#మాజీ ఎంపీపీ, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి.

నల్లబెల్లి నేటి ధాత్రి:

ఫరీద్ నగర్ బాలాజీ నగర్ ప్రజలు నీటి సౌకర్యం.!

ఫరీద్ నగర్ బాలాజీ నగర్ ప్రజలు నీటి సౌకర్యం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు మనిషి జీవితంలో నీరు ఒక భాగం. నీరు లేకపోతే జీవ రాశుల మనుగడ కష్టం. ఆహారం లేకున్నా కొన్ని రోజుల పాటు జీవించగలం కానీ నీరు లేకపోతే ఒక్క రోజూ జీవించలేం. అటువంటి అత్యవసరమైన నీరు దొరకక ఐదు ఆరు రోజుల నుండి ఓ జహీరాబాద్ లోని ఫరీద్ నగర్ బాలాజీ నగర్ ప్రజలు అల్లాడుతోంది. 12వ వార్డు వీధిలో ఒకే ఒక బోరు ఉంది ఆ బోరు గ్యాప్ ఇవ్వడం వల్ల బ్యాంకులో నీరు ఎక్కడం లేదు అయితే మంజీరా నీరు ఎనిమిది రోజుల నుండి రావడం లేదు ఆర్ డబ్ల్యు ఎస్ మరియు ఎం సి జెడ్ అధికారులు చూసి చూడలేనట్టు వ్యవహరిస్తున్నారు తాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు ఆందోళన చేశారు.మంచినీటి సమస్యతో అల్లాడుతున్నామని మహిళలు తెలిపారు. కనీసం తాగడానికి మంచి నీరు లేక నోరుఎండిపోతున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారన్నారు. ఎన్నిసార్లు అధికారులు చుట్టూ తిరిగిన తప్ప ఇప్పటివరకు మంచినీరు మా ప్రాంతానికి ఇవ్వలేదని మండుతున్న ఎండల్లో పిల్లా పాపలతో అల్లాడిపోతున్నామన్నారు. తక్షణం జిల్లా కలెక్టర్‌ స్పందించి మాకు మంచి నీటి సౌకర్యం కల్పించి మా దాహార్తిని తీర్చాలని మహిళలు ఆందోళన చేపట్టారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో కలెక్టరేట్‌ ని కలిసి తమ సమస్యలను చెప్తామని మహిళలు హెచ్చరించారు
పై అధికారులు వెంటనే స్పందించి ప్రజలను నీటి సౌకర్యం కల్పించాలని కోరుచున్నారు.

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు.!

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కొత్త నంబర్ల నుండి వచ్చే కాల్స్, లింక్స్, ఏపీకె మెసేజ్ ల పట్ల తస్మాత్ జాగ్రత్త.

సైబర్ నేరాలకు గురైతే గంటలోపు(గోల్డెన్ అవర్) ట్రోల్ ఫ్రీ నంబర్ 1930 కి కాల్ చేసి పిర్యాదు చేయడం చాలా ముఖ్యం.

జిల్లా ఎస్పీమహేష్ బి. గితే ఐపీఎస్

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

 

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని,సులభంగా డబ్బులు సంపాదించాలానే అత్యశ చివరికి ఇబ్బందుల పాలు చేస్తుందని, సైబర్ నేరం జరిగిన గంట(గోల్డెన్ అవర్)లోపు 1930 నంబర్ కు లేదా www.cybercrime.gov.in వెబ్ సైట్లో పిర్యాదు చేయడం ద్వారా పోగొట్టుకున్న మొత్తాన్ని తిరిగి రాబట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు. అంతేకాకుండా
మీమొబైల్ ఫోన్ కి ఆఫ‌ర్లు,డిస్కౌంట్ల పేరుతో వచ్చే లింక్స్ ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాలని,అప‌రిచిత వ్య‌క్తుల నుంచి వ‌చ్చే మెసేజ్ ల‌కు,కొత్త నంబర్ల నుండి వచ్చే ఏపీకే ఫైల్స్ డౌన్ లోడ్ చేస్తే మీ మొబైల్ హ్యాక్ అయ్యే అవ‌కాశం ఉన్నందున వాటి పట్ల స్పందించవద్దని,సైబర్ మోసగాళ్లు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి & ఫ్లీప్ చేయడానికి విభిన్నమైన కార్యనిర్వహణతో బయటకు వస్తున్నారని వాటిని క‌ట్ట‌డికి అప్ర‌మ‌త్త‌త‌, అవ‌గాహ‌నే ఆయుధం అని తెలిపారు.సామాజిక మాధ్యమాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల తీయని మాటల వలలో పడి వ్యక్తిగత విషయాలు, ఫోటోలు అస్సలు ఇవ్వవద్దని,వ్యక్తిగత విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఏమరుపాటుగా ఉండవద్దని ,సోషల్ మీడియా అకౌంట్స్ కి తప్పని సరిగా ప్రొఫైల్ లాక్ పెట్టుకోవాలని, సోషల్ మీడియా వేధికాకగా వేధిస్తే తక్షణమే పోలీస్ వారిని స్పందించాలని తెలిపారు.

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు.

● లోన్ యాప్ లకు దూరంగా ఉండాలి.
● కస్టమర్ కేర్ నంబర్లను గూగుల్ లో అస్సలు వెతకవద్దు. ఆయా సంస్థల అధికారిక వెబ్ సైట్ నుంచి మాత్రమే కస్టమర్ కేర్ నంబర్లను పొందాలి.
●.అపరిచిత నంబర్ల నుంచి ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా వచ్చే వీడియో కాల్స్ కు స్పందించవద్దు.
●. లాటరీ ఆఫర్లంటూ వచ్చే మెసేజ్ లను నమ్మవద్దు.
●.అన్ వెరిఫైడ్ యాప్స్, వెబ్ సైట్స్ అందించే ప్రకటనలు నమ్మవద్దు వారిచ్చే మోసపూరిత ఆఫర్లకు స్పందించి మోసపోవద్దు.
●.ఈజీ రిటర్న్స్, కమిషన్ బేస్డ్ సైట్లలో పెట్టుబడి పెట్టవద్దు.
●. పాస్వర్డ్, ఓటీపీ, పిన్ లాంటి వివరాలను ఎట్టిపరిస్థితుల్లో ఎవరికీ షేర్ చేయవద్దు.
●.మీకు లాటరీ తగిలిందంటూ ఎవరైనా మెసేజ్ చేసినా, మెయిల్ పంపించినా స్పందించవద్దు.
●.ఒక పోలీసు అధికారి పేరుతో మీకు ఫోన్ చేసి మీ ఆధార్ గురించి మాట్లాడితే స్పందించకండి ఇది ఒక స్కామ్..
●. మీరు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉన్నారని చెబితే, స్పందించవద్దు.ఈది ఒక స్కామ్.
మీ కోసం లేదా మీరు పంపిన ప్యాకేజీలో డ్రగ్స్ కనుగొనబడిందని మీకు చెబితే ప్రతిస్పందించవద్దు.ఇది ఒక స్కామ్.
ఎవరైనా మీకు కాల్ చేసివారు పొరపాటున మీ UPI IDకి డబ్బు పంపారన తమ డబ్బును తిరిగి ఇవ్వాలని కోరితే ప్రతిస్పందించవద్దు ఇది ఒక స్కామ్.

మావోయిస్టుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తులు అరెస్ట్

మావోయిస్టుల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తులు అరెస్ట్

సీఐ లోడిగా రవీందర్,ఎస్సై సైదా రహూఫ్

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

 

గుండాల ఎస్సై రహుఫ్ తమ సిబ్బందితో కలిసి సోమవారం పెట్రోలింగ్ కు వెళుతుండగా తురుబాక గ్రామం నందు రోడ్డుపై ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించగా వారిని పట్టుకొని విచారించగా వారి పేర్లు
పాయం రాజేందర్ నడిమిగూడెం,ఆళ్లపల్లి మండలం కల్తీ పాపయ్య (అలియాస్ సర్పంచ్) ఘణపురం గ్రామం,గుండాల మండలం అను ఇద్దరు గతంలో ప్రజా ప్రతిఘటన దళంలో పనిచేశారు.
కల్తీ పాపయ్య 2010 సంవత్సరంలో హత్యా ప్రయత్నం కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి పోయి వచ్చాడు.పాయం రాజేందర్ గతంలో ప్రజా ప్రతిఘటన దళంలో పని చేసి ఆళ్లపల్లి పోలీస్ ఎదుట లొంగిపోయాడు వీరిద్దరూ జల్సాలకు అలవాటుపడి ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే ఉదేశ్యంతో మావోయిస్టు పార్టీ పేరు చెప్పి గుండాల,ఆళ్లపల్లి మండలాల వ్యాపారస్తులను గత రెండు,మూడు నెలల నుండి ఫోన్లు చేసి పార్టీ ఫండ్ కోసం డబ్బులు కావాలని బెదిరిస్తున్నారు.సోమవారం వీరిద్దరిని గుండాల పోలీస్లు అరెస్ట్ చేశారు.వీరి ఇరువురి నుండి 5000 రూపాయలు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత మావోయిస్టులది కాలం చెల్లిన సిద్దాంతాలని,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టు ఉనికి అనేది లేదని ఇల్లందు డిఎస్పి చంద్రభాను తెలిపారు.ఎవరైనా మావోయిస్టుల పేరుతో ఫోన్లు చేసి బెదిరిస్తే ప్రజలు ఎటువంటి భయబ్రాంతులకు గురి కాకుండా పోలీస్ వారికి పిర్యాదు చేయవలసిందిగా కోరారు.వీరిని పట్టుకోవటం లో కృషి చేసిన గుండాల సిఐ లోడిగ రవీందర్,ఎస్ఐ సైదా రహుఫ్, పిసి వెంకటేశ్వర్లు ను డిఎస్పి అభినందించారు.

పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిది లో ఆరుగురు.!

పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిది లో ఆరుగురు గంజాయి అమ్మకం దారుల పట్టివేత…

గంజాయి పండించిన, తరలించినా, అమ్మిన సేవించిన వారి పైన కఠిన చర్యలు తప్పవు – డీసీపీ కరుణాకర్

ఓదెల (పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి :

 

 

 

ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ లో విలేఖరుల
సమావేశంలో డిసీపీ పి కరుణాకర్ కేసు వివరాలను వెల్లడించారు. పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టు గా అమ్ముచున్న గంజాయి ముఠాను పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ మరియు సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు.. పోత్కపల్లి రైల్వే స్టేషన్ లో అనుమానస్పదంగా తిరుగుచున్న వ్యక్తులను పట్టుకొని ని విచారించగా గంజాయి అమ్మడానికి వచ్చినట్టు తెలియ చేయగా నిందితుల వద్ద ఉన్న గంజాయిని
చూపించగా అది 9.664 కిలోల ఎండు గంజాయి గా ఉంది, అట్టి గంజాయిని మరియు ఒక మోటార్ సైకిల్, రెండు మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకుని ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు డిసిపి పి.
కరుణాకర్ అన్నారు ఈ సందర్భంగా పట్టుబడిన కిరణ్
వివరాలు:-ఎ 1.
గ్రామం. ముర్ముర్, అంతర్గాం మండలం.
ఎ 2. జాడి ప్రకాష్ గ్రామం. ముర్ముర్, అంతర్గాం మండలం. ఎ) 3. గుజ్జుల సాయి తేజ, గ్రామం.
ద్వారకా నగర్, గోదావరిఖని.
ఎ 4. కొమురవెల్లి పవన్, గ్రామం. రామగుండం. ఎ 5. ఇందిబెల్లి సందీప్ గ్రామం. అంతార్గాం. ఎ 6. లింగన్నపేట విష్ణువర్ధన్ గ్రామం. ముర్ముర్, అంతర్గాం మండలం. మరియు
పరారీలో ఉన్న నిందితులు ఎ 7. ఖేల కుమార్, గ్రామం. ఉరుమనూర్, కలిమేల, ఒడిస్స రాష్ట్రము. స్వాధీనం చేసుకున్న గంజాయి దాదాపు 9.664 కిలోల పట్టుకున్న గంజాయి విలువ రు. 4,80,000/-
ఒక మోటార్ సైకిల్, రెండు మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పట్టుకున్న గంజాయిని డిప్యూటీ తాసిల్దార్ బాలసాని శ్రీనివాస్.
రెవిన్యూ ఇన్స్పెక్టర్ మహేష్ జూనియర్ అసిస్టెంట్ అనిల్ కుమార్ ఫోటోగ్రాఫర్ ఇరుకుల వీరేశం ఏఎస్ఐ రత్నాకర్ హెచ్ సి జి కిషన్ పిసి రాజేందర్ సతీష్ ల సమక్షంలో పంచనామ నియమించారని అన్నారు
యువకులు ఈజీ మనీ కోసం అమాయకుల ప్రాణాలతో చెలగాటం వాడుతున్నారని గంజాయి మహమ్మారి బారినపడి ఎంతో విద్యార్థులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారని మత్తు కు అలవాటు పడి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని ఇలాంటి వ్యక్తులు
4698
ఎక్కడ కనబడ్డ విక్రయించిన పోలీసు వారికి సమాచారం అందించాలని అన్నారు అదేవిధంగా ఆర్థిక నేరాలకు చేస్తున్న పలువురిని చకచక్యంగా పట్టుకున్నందుకు ఎస్సై దీకొండ రమేష్ మరియు పోలీస్ సిబ్బందిని అభినందిస్తూ వారికి రివార్డు అందజేశారు ఈ కార్యక్రమంలో డిసిపి పి కరుణాకర్ ఏసిపి గజ్జి కృష్ణ యాదవ్ సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి ఎస్సై దీకొండ రమేష్ ఏఎస్ఐ రత్నాకర్ జి కిషన్ పిసి రాజేందర్ సతీష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన.!

*ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన గొప్ప సంఘసంస్కర్త బసవేశ్వరుడు : ఎమ్మెల్యే మాణిక్ రావు *

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

892వ బసవ జయంతి* సంధర్బంగా జహీరాబాద్ లింగయత్ సమాజ్ వారి ఆధ్వర్యంలో స్థానిక బసవేశ్వర ఆలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు శ్రీ కోనింటి మాణిక్ రావు
బసవ వాదాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ జహీరాబాద్ లింగాయత్ సమాజ్ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన డాక్టర్ మడుపతి. బస్వరాజ్ గారికి లింగయాత్ సమాజ్ వారితో కలిసి ఘనంగా సన్మానించారు,అనంతరం రాష్ట్రీయ బసవ దళ్ వారి ఆహ్వానం మేరకు దత్తగిరి కాలనీ లో బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.

 

Social Reformer

మహాత్మా బసవేశ్వరుడు 12వ శతాబ్దంలోనే కుల వివక్షతను వ్యతిరేకించి ధనిక, పేద, అందరూ సమానమే అని చాటిచెప్పిన మహనీయుడు శ్రీ కళ్యాణ బసవేశ్వరుడు బసవ జయంతి సందర్భంగా మహనీయునికి ఘనమైన నివాళి శ్రీ బసవేశ్వర స్వామి వారి శుభాశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటూ బసవ జయంతి శుభాకాంక్షల తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజి సీడీసీ చైర్మన్ ఉమకాంత్ పాటిల్,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,మహిళ నాయకురాలు పద్మజ ,మాజి సర్పంచ్ లు ప్రభు పటేల్,అప్ప రవ్ పాటిల్,అశోక్ పటేల్,
లింగాయాత్ సమాజ్ అధ్యక్షులు రాజు శెట్కార్, ప్రధాన కార్యదర్శి సుభాష్ ,కార్యవర్గ సభ్యులు
తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version