వీబి జి రామ్ జి బిల్లు – 2025 ను రద్దు చేయాలి
ములుగు టౌన్ నేటి దాత్రి
ఉపాధి హామీ చట్టాన్ని మహాత్మా గాంధీ పేరు తో పునరుద్దరణ చేసి కొనసాగించాలి
ములుగు జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్ బిల్లు, 2025 (VB-G RAM G) ను రద్దు చేయాలని సిపిఎం ములుగు మండల కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమం చెయ్యడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం ములుగు మండల కార్యదర్శి MD. గఫుర్ పాషా మాట్లాడుతూ పేద ప్రజలకు ఉపాధి కల్పనకోసం కమ్యూనిస్టు పార్టీలు తీసుకువచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ను రద్దు చేసి దాని స్థానంలో తీసుకువచ్చిన జి రామ్ జి బిల్లు ప్రభుత్వం రద్దు చేసి పాత చట్టాన్ని కొనసాగించాలని అన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టంలో చేసిన మార్పుల వల్ల కార్మికులు ఉపాధి హామీ కూలీలు చట్టబద్ధమైన హక్కులు కోల్పోతారని అన్నారు.ఈ బిల్లులో పని డిమాండ్‌కు తగినట్లుగా నిధులను కేటాయించాల్సిన బాధ్యత నుండి కేంద్ర ప్రభుత్వం తప్పుకుంటుంది అన్నారు. అలాగే పని చేయాలని నిర్ణయించడం చేసిన పనులకు బడ్జెట్ విడుదల చేయడం లాంటి పూర్తి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంచుకోవడం అలాగే పని కావాలని కోరడం చేసిన పనికి కూలి పెంచాలని హక్కులు కూలీలకు లేకుండా నియంత్రించడం వల్ల అనేక మంది గ్రామీణ ఉపాధి కార్మికులకు నష్టం జరుగుతుందని అన్నారు
వ్యవసాయ పనులు ఉధృతంగా వున్న సమయంలో 60 రోజుల వరకు ఉపాధిని సస్పెండ్ చేసేందుకు ప్రభుత్వాలను అనుమతిస్తున్న నిబంధన వల్ల అత్యంత అవసరమైన కాలంలో గ్రామీణ కుటుంబాలకు పనులను నిరాకరిస్తూ, వారు భూస్వాములపై ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది అన్నారు. పని ప్రదేశాల్లో డిజిటల్ హాజరును తప్పనిసరి చేయడం సరికాదని అన్నారు.
వేతనాల చెల్లింపుల కోసం బడ్జెట్లో కేంద్ర రాష్ట్రాల రాష్ట్రాలతో 60:40 నిష్పత్తిలో పంచుకోవాలన్న ఏర్పాటును తీసుకురావడం ద్వారా ఈ బిల్లు కేంద్రం బాధ్యతను తగ్గిస్తోంది అన్నారు.
పైగా ఈ పథకానికి ఎంఎన్‌ఆర్‌ఇజిఎగా వున్న పేరును జి ఆర్‌ఎఎం జి (జి రామ్ జి)గా మార్చాలన్న నీచపు ఆలోచన వెనుక బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ సైద్ధాంతిక ధోరణి ప్రతిబింబిస్తోంది. గ్రామీణ పేద మధ్యతరగతి కార్మికులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న చట్టాన్ని నెమ్మదిగా చిన్న చిన్న మార్పులతో సవరణలు చేస్తూ బాధ్యతల నుండి తగ్గుతూ పూర్తిగా చట్టాన్ని నిర్వీర్యం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు దీనివల్ల అనేకమంది కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు ఈ నేపథ్యంలో విబి-జిఆర్‌ఎఎంజి బిల్లును తక్షణమే రద్దు చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో సిపిఎం ములుగు జిల్లా కమిటీ సభ్యులు రత్నం. ప్రవీణ్ ములుగు మండల కమిటీ సభ్యులు కొర్ర రాజు, గుండెబోయిన రవిగౌడ్, కలువల రవీందర్, కొడిపాక చంటి, కదురు వీరాస్వామి, వేణు, సుధాకర్, లింగన్న, సురేష్ తదితరులు 10 మంది పాల్గొన్నారు.
