పాఠశాలలో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్…

పాఠశాలలో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్

 

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని చర్లపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం రోజున రాష్ట్ర విద్యాశాఖ అనుదేశానుసారంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ ఆదేశించినట్టుగా ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ మాట్లాడుతూ ఎదిగే పిల్లలకు అన్ని రకాల పౌష్టికాహారాన్ని అందించినప్పుడే పిల్లల్లో ఎదుగుదల కనిపించి ఆరోగ్యంగా మానసికంగా దృఢంగా ఉంటారని ఈ సందర్భంగా తల్లిదండ్రులను కోరారు.తల్లిదండ్రులు విద్యార్థుల కోసం వివిధ రకాలైన వంటకాలను చికెన్, చికెన్ బిర్యాని,తెలంగాణ వంటకాలు,పులిహోర గులాబ్ జామ్,సేమ్యా,పుల్కా, సర్వపిండి,నువ్వుల ముద్దలు,
పల్లి పట్టీలు,పేలాల ముద్దలు, రాఫుడ్, వివిధ రకాలైనటువంటి పండ్లు తీసుకువచ్చి వారి పిల్లలకు తినిపించారు‌.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవా,కంచరాజు కుమార్, పుల్లూరి రామకృష్ణ, అంగన్వాడి సూపర్వైజర్ శ్రీదేవి,అంగన్వాడి టీచర్ బీముడి లక్ష్మి,సుమారు 40 మంది తల్లులు పాల్గొనడం జరిగింది.

పిల్లలకు రోజూ పనీర్‌ వంటకాలను పెట్టవచ్చా..

పిల్లలకు రోజూ పనీర్‌ వంటకాలను పెట్టవచ్చా..

 

బయట దొరికే పనీర్‌లో సాధారణంగా కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని అన్‌బ్రాండెడ్‌ పనీర్‌లలో నాణ్యత పెంచడానికి పిండి కూడా కలుపుతారు. ఇవి ఆరోగ్యానికి మంచివి కావు. అందుకే వీలైనంతవరకు ఇంట్లోనే తాజా పనీర్‌ తయారు చేసి వాడటం ఉత్తమం.

బయట దొరికే పనీర్‌లో సాధారణంగా కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని అన్‌బ్రాండెడ్‌ పనీర్‌లలో నాణ్యత పెంచడానికి పిండి కూడా కలుపుతారు. ఇవి ఆరోగ్యానికి మంచివి కావు. అందుకే వీలైనంతవరకు ఇంట్లోనే తాజా పనీర్‌ తయారు చేసి వాడటం ఉత్తమం. ఇంట్లో, టోన్డ్‌ లేదా కొవ్వు మితంగా ఉన్న పాలతో తయారు చేసినప్పుడు పనీర్‌ను రోజూ తినవచ్చు, కానీ తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ముఖ్యంగా బాగా నూనెలో వేపిన రూపంలో కాకుండా కూరగాయలతో కలిపి వండితే మరింత ఆరోగ్యకరం. ఉదాహరణకు మిక్స్‌ ్డవెజిటబుల్‌ కర్రీ, పాలకూర పనీర్‌ వంటి వంటకాలు రుచికరంగానే కాకుండా పోషకవిలువలతో కూడినవిగా ఉంటాయి. పాలల్లో లాగానే పనీర్‌లో ప్రోటీన్‌, క్యాల్షియం, ఫాస్ఫరస్‌ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల ఎముకల అభివృద్ధికి, శరీరానికి బలాన్ని అందించడానికి చాలా సహాయపడతాయి.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version