పాలకోవా ఆరోగ్యానికి మంచిదేనా..

పాలకోవా ఆరోగ్యానికి మంచిదేనా?

 

పాలను ఎక్కువసేపు మరిగించి దానిలోని నీటి శాతాన్ని తగ్గించి గట్టి పదార్థంగా మార్చి పాలకోవా తయారు చేస్తారు. కాబట్టి, ఇందులో సహజంగానే కొవ్వు, క్యాలరీలు అధికంగా ఉంటాయి. తీపి కోసం చక్కెర లేదా బెల్లం కూడా అధిక మొత్తంలో కలుపుతారు.

పిల్లలకీ, పెద్దలకీ సాధారణంగా పాలకోవా అంటే చాలా ఇష్టం. అయితే పాలతో తయారయ్యే ఈ తీపి పదార్థాన్ని తినడం ఆరోగ్యానికి మంచిద

పిల్లలకు రోజూ పనీర్‌ వంటకాలను పెట్టవచ్చా..

పిల్లలకు రోజూ పనీర్‌ వంటకాలను పెట్టవచ్చా..

 

బయట దొరికే పనీర్‌లో సాధారణంగా కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని అన్‌బ్రాండెడ్‌ పనీర్‌లలో నాణ్యత పెంచడానికి పిండి కూడా కలుపుతారు. ఇవి ఆరోగ్యానికి మంచివి కావు. అందుకే వీలైనంతవరకు ఇంట్లోనే తాజా పనీర్‌ తయారు చేసి వాడటం ఉత్తమం.

బయట దొరికే పనీర్‌లో సాధారణంగా కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని అన్‌బ్రాండెడ్‌ పనీర్‌లలో నాణ్యత పెంచడానికి పిండి కూడా కలుపుతారు. ఇవి ఆరోగ్యానికి మంచివి కావు. అందుకే వీలైనంతవరకు ఇంట్లోనే తాజా పనీర్‌ తయారు చేసి వాడటం ఉత్తమం. ఇంట్లో, టోన్డ్‌ లేదా కొవ్వు మితంగా ఉన్న పాలతో తయారు చేసినప్పుడు పనీర్‌ను రోజూ తినవచ్చు, కానీ తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ముఖ్యంగా బాగా నూనెలో వేపిన రూపంలో కాకుండా కూరగాయలతో కలిపి వండితే మరింత ఆరోగ్యకరం. ఉదాహరణకు మిక్స్‌ ్డవెజిటబుల్‌ కర్రీ, పాలకూర పనీర్‌ వంటి వంటకాలు రుచికరంగానే కాకుండా పోషకవిలువలతో కూడినవిగా ఉంటాయి. పాలల్లో లాగానే పనీర్‌లో ప్రోటీన్‌, క్యాల్షియం, ఫాస్ఫరస్‌ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల ఎముకల అభివృద్ధికి, శరీరానికి బలాన్ని అందించడానికి చాలా సహాయపడతాయి.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version