చాకలి ఐలమ్మ ఆశయాలను ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్బంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ బుధవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలు అని ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు.తెలంగాణ రైతాంగ సాయుధ ఉద్యమంలో వీరనారి చాకలి ఐలమ్మ ముఖ్య భూమిక పోషించారని ,తెలంగాణ పౌరుషాన్ని, పోరాటాన్ని, త్యాగాన్ని భావి తరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని చూపిన గొప్ప పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సౌజన్య, వివిధ శాఖల అధికారులు,సిబ్బంది, రజక సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.