చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలి
ఐఎఫ్ టియుసి నాయకుడు చంద్రగిరి శంకర్
భూపాలపల్లి నేటిధాత్రి
సుభాష్ కాలనీ బస్టాండ్ వద్ద చిట్యాల చాకలి ఐలమ్మ 40 వర్ధంతి వేడుకల్లో పాల్గొని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఐఎఫ్ టియుసి రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ చంద్రగిరి శంకర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో చిట్యాల చాకలి ఐలమ్మ జన్మించి దొరలు భూస్వాములకు వ్యతిరేకంగా మహిళ అయి ఉండి పోరాటాలు చేసి విజయాన్ని సాధించారు మహిళలు ఇండ్ల నుండి బయటికి రాని కాలంలోనే వీరవనితగా దొరలు భూస్వాములను తరిమి కొట్టి వారికి ఉండబడిన భూములను ప్రజలకు పంచిన విప్లవ వీర వనిత చాకలి ఐలమ్మ ఆశయాలను మనందరం కొనసాగించాలి అని వారు అన్నారు
