నేటి యువతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదర్శం చందుపట్ల కీర్తి రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని భారతీయ జనతా జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు
ర్యాలీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి హాజరైనారు అనంతరం సంఘ మిత్ర డిగ్రీ కాలేజీ నుండి ప్రారంభమైన ర్యాలీ, వివిధ వీధుల గుండా అంబేద్కర్ సర్కిల్ వరకు ఉత్సాహంగా సాగింది. దేశభక్తి నినాదాలతో గాలిలో ర్యాలీ చేశారు అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు
ఈ సందర్భంగా చందుపట్ల కీర్తి రెడ్డి మాట్లాడుతూ
దేశాన్ని ఐక్యం చేసిన లౌహ పురుషుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ చరిత్రలో అజరామరమైన నాయకుడు. ఆయన నాయకత్వం లేకపోయి ఉంటే మన దేశం ఈరోజు ఒకటిగా ఉండేది కాదు. ఆయన దృఢనిశ్చయంతోనే 562 రియాసతాలను ఒకే భారతదేశంగా ఏకం చేశారు. ఆయన చూపిన మార్గం, ఆయన నిబద్ధత ప్రతి నాయకుడికి, ప్రతి పౌరుడికి స్ఫూర్తి కావాలి, అని అన్నారు.
నేటి తరంలో యువతకు సర్దార్ పటేల్ ఆలోచనలను పరిచయం చేయడం చాలా అవసరం. ఆయన చూపిన దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం మనందరిలో నాటుకుపోవాలి. దేశం పట్ల గౌరవం, సమైక్యత పట్ల అవగాహన పెంచుకోవాలి. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేది నాయకులు మాత్రమే కాదు, ప్రతి ఒక్క పౌరుడు. అందుకే ప్రతి ఒక్కరూ పటేల్ స్ఫూర్తితో దేశ నిర్మాణంలో భాగస్వాములుగా మారాలి,” అని పిలుపునిచ్చారు.
జిల్లా కేంద్రం మొత్తం “జై సర్దార్ పటేల్”, “ఒక భారతం ఒక మనసు ఒక జెండా” అనే నినాదాలతో మార్మోగింది. అని అన్నారు ఈ కార్యక్రమంలో ఐక్యత మార్చ్ కో కన్వినర్స్ తాటికొండ రవి కిరణ్ సయ్యద్ గాలిఫ్ జిల్లా ఉపాధ్యక్షులు దాసరి తిరుపతిరెడ్డి రెడ్డి సామల మధుసూదన్ రెడ్డి కొడపాక స్వరూప జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల రాజు జిల్లా కార్యదర్శి శివనాత్రి వేణు జీట్టబోయిన సాంబయ్య మీడియా కన్వీనర్ మునేందర్ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు జగ్గయ్య సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి వివిధ మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ పులి గు జ్జల రాజు బండి శ్రీనివాస్ గుర్రపు నాగరాజ్ గౌడ్ రామకృష్ణ అర్బన్ ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి బీజేవైఎం నాయకులు వంశీ బిఎంఎస్ నాయకులు బిక్షపతి తదితరున్నారు
