గుండంపెల్లి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అవగాహన సదస్సు
మల్లాపూర్ ,నేటి దాత్రి –
మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలోకొత్త గా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజషన్ స్కీం లో అర్హత సాధించేందుకు ప్రత్యేక షేర్ కాపిటల్ కలెక్షన్ ప్రోగ్రాం గుండంపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో గ్రామా సర్పంచ్ దప్పుల పద్మ నర్సయ్య గారు ఏఎంసి ఛైర్మెన్ అంతడుపుల పుష్ప లత నర్సయ్య,ఉప సర్పంచు లు, వార్డు సభ్యులు, రైతులు, పంచాయితీ కార్యదర్శి, నారాయణ సొసైటీ కార్యదర్శి భూమేష్ , సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు
