చంద్రగిరి ఎమ్మెల్యే ఆపద బాధితులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

*ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం…

*చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని.

*చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే…

*చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని తిరుపతి రూరల్ , రామచంద్రపురం మండలాలకు సంబంధించిన పలువురికి సీఎంఆర్ఎఫ్ ద్వారా 47క్షల 60 వేల 384 రూపాయలను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.

*కష్టకాలంలో మా కుటుంబాలను ఆదుకున్న ఎమ్మెల్యే కి ప్రత్యేక ధన్యవాదాలు తేలిపిన బాధితులు..

తిరుపతి రూరల్(నేటిధాత్రి:

తిరుపతి రూరల్ మండలం తనపల్లి రఘునాథ్ రిసార్ట్స్ లోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రగిరి, పాకాల మండలాలకు సంబందించిన పలువురికి సిఎంఆర్ఎఫ్ సహయనిధి ద్వారా సుమారు 47 లక్షల 60 వేల 384 రూపాయలు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. అనారోగ్య ,ఇతర సమస్యలతో బాధపడుతున్న విషయం స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేయాలని ఉన్నత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చిన చెక్కులను ఎమ్మెల్యే చేతులమీదుగా బాధిత కుటుంబ సభ్యులకు పంపిణీ చేశారు. కష్టకాలంలో మా కుటుంబాలను ఆదుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కి ,ఎమ్మెల్యే పులివర్తి నాని కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన భాధిత కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కిష్త్వార్ క్లౌడ్‌బర్స్ రక్షణ కార్యక్రమం నాలుగో రోజు..

కిష్త్వార్ జిల్లా చిసోటీ గ్రామంలో, ఆగస్టు 14న జరిగిన క్లౌడ్‌బర్స్ కారణంగా భారీ ఫ్లాష్ ఫ్లడ్‌లు చోటుచేసుకున్నాయి. 60 మంది ప్రాణాలు కోల్పోగా, 70 మంది ఇంకా అదృశ్యంగా ఉన్నారు. 167 మంది గాయాలతో రక్షించబడ్డారు. ఫ్లాష్ ఫ్లడ్‌ల కారణంగా మార్కెట్, లంగర్ స్థలాలు, 16 ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, 3 ఆలయాలు, 4 వాటర్ మిల్స్, 30 మీటర్ల పొడవైన వంతెన, పలు వాహనాలు నశించాయి.
సమగ్ర రక్షణ చర్యల్లో NDRF, SDRF, ఆర్మీ, BRO, పోలీస్, స్థానిక వాలంటీర్లు పాల్గొని, రక్షణ చర్యలను వేగవంతం చేస్తున్నారు. 17 మీటర్ల బ్రీడ్జ్ నిర్మాణం జరుగుతూ, రోడ్డు కనెక్టివిటీ పునరుద్ధరించబడుతుంది. బాధితులకు ఆహారం, మందులు, మరియు ఇతర సహాయాలు అందిస్తున్నట్లు అధికారులు చెప్పారు. Machail Mata యాత్ర నాలుగో రోజు కూడా నిలిపివేయబడింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version