పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ని వారి నివాసంలో మొక్క(ఆక్సిజన్), శాలువ కప్పి మర్యాద పూర్వకంగా కలిసిన నడికూడ ఎంపీడీవొ రామ రామకృష్ణ అదే విధంగా మండలం లోని ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి కి కలిసి పని చేయాలని ఎమ్మెల్యే అన్నారు. వారితో పాటు కార్యాలయ సహాయకులు గోవిందు నవీన్ కుమార్ పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారం నిర్వహించిన శాసనసభ్యులు మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జూబ్లీహిల్స్ నియోజకవర్గం శ్రీరామ్ నగర్ డివిజన్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు గారికి జహీరాబాద్ సీనియర్ నాయకులు ముర్తజ తన యాక్టివా బండి పై ఎమ్మెల్యేను తీసుకొని ప్రచారంలో పాల్గొన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, ప్రతీ ఒక్క పేద వారితో పాటు అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలన్నా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ గారిని గెలిపించాలని కోరడమైనది.ఎమ్మెల్యే గారితో పాటుగా రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరీద్,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్,యువ నాయకులు మిథున్ రాజ్,ముర్తుజా, డివిజన్ నాయకులు ,మైనారిటీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…
వివిధ వార్డ్ ల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన జహీరాబాద్ ఎమ్మెల్యే
◆:- శాసనసభ్యులు మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి;
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భాగంగా రహ్మత్ నగర్ డివిజన్ (శ్రీ రామ్ నాగర్ ) లోని వివిధ వార్డ్ ల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన జహీరాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు మాణిక్ రావు జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్ నగర్ డివిజన్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ కొనింటి మాణిక్ రావు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, ప్రతీ ఒక్క పేద వారితో పాటు అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలన్నా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ గారిని గెలిపించాలని కోరడమైనది.
నెక్కొండ మండల కేంద్రంలోని చంద్రుగొండ, బంజరపల్లి, మూడు తండా, గొల్లపల్లి, వాగ్య నాయక్ తండ, లకు సంబంధించి ఆటో యూనియన్ ఏర్పరచుకొని 30 సంవత్సరాలుగా అవుతున్న తరుణంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి జరిగే ఆటో యూనియన్ ఎన్నికలను నెక్కొండ నవత ఆటో యూనియన్ అధ్యక్షుడు మోడం సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్నికలలో చంద్రుగొండ ఆటో యూనియన్ అధ్యక్షుడిగా పొదిల సురేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా ఉపాధ్యక్షుడిగా మహమ్మద్ రఫీ ని, కార్యదర్శిగా చిలువేరు కొమ్మాలను, కోశాధికారి జితేందర్ , కమిటీ మెంబర్ గా కాజా పాషను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చంద్రుగొండ బంజరుపల్లి ఆటో యూనియన్ నూతన అధ్యక్షుడు పొదిల సురేష్ తెలిపారు. అనంతరం సురేష్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల అభ్యున్నతి కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా నెక్కొండ నవత యూనియన్ అధ్యక్షుడు మోడెం సురేష్ చంద్రుగొండ బంజరుపల్లి ఆటో యూనియన్ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు.
భవిష్యత్తు బి ఆర్ఎస్ దే బిఆర్ఎస్ హయాంలో ఎన్నో గొప్ప అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బి ఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు దేవునూరి కుమార్
మొగులపల్లి నేటి ధాత్రి
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల బి ఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దేవునూ రి కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో భవిష్యత్తు టిఆర్ఎస్ పార్టీ అని తెలంగాణ లో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నుండి పదేండ్ల పాలనలో దేశంలో ఎక్కడ కని విని ఎరుగని అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సబ్బండ వర్గాలకు అండగా నిలబడింది అనేక పరిపాలన సంస్కరణలకు సైతం నాంది పలికింది కొత్త జిల్లాలు మండలాలు పంచాయితీలను ఏర్పాటు చేసి పాలన సంస్కరణకు శ్రీకారం చుట్టింది విధానమైన నిర్ణయాలను తీసుకొని ప్రజలకు చెంతకు పాలనపారదర్శకంగా సేవలను అందిస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచింది పదేండ్లలో ప్రజల అవసరాల గురించి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులు నెలకొల్పింది ప్రజల భద్రత కోసం నేరాలను సమూలంగా అరికట్టేందుకు పోలీసు కమిషన్ లేట్లు సంఖ్యను పెంచింది భూముల రిజిస్ట్రేషన్ కోసం ధరణి పోస్టల్ అందుబాటులోకి తీసుకురావడంలో ఇష్ట రాజ్యాంగ రికార్డులు మార్చే సాంస్కృతికి చెక్కుబడింది ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 52 మున్సిపాలిటీలు ఉండగా కొత్తగా మరో 76 పురపాలక సంఘాలను ఏర్పాటు చేసింది నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని 2018 సంవత్సరంలో తీసుకువచ్చి గ్రామాల్లో ప్రభుత్వ చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాన్ని రూపొందించారు ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ట్యాంకర్ అందజేశారు ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాలేశ్వరం ప్రాజెక్టులు నిర్వహణకు ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ మొబైల్ ఈ యాప్ లను రూపొందించి రాష్ట్రంలో అన్ని వాగులపై సుమారు 1200 చెక్ డ్యాములు నిర్మించి ప్రజలకు రైతులకు అనేక సేవలు అందించడంలో బి ఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు వెనుకడుగు వేయలేదు కల్యాణ లక్ష్మి పెన్షన్ 2000 రైతు చనిపోయిన పది రోజుల వ్యవధిలోనే ఐదు లక్షల రూపాయలు రైతు బీమా అందించిన మహనీయుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గత 10 ఏళ్లలో ఎన్నో అద్భుతాలు చేశారు అనేక చెరువుల మరమ్మతులు చేసి యాదవులకు గొర్లు ముదిరాజులకు చేప పిల్లలు పంపిణీ చేశారు చేపల విక్రయాలు కొరకు వాహనాలు పంపిణీ చేశారు ఎప్పుడు ఎలక్షన్ జరిగిన బిఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలు విజయం సాధిస్తుందని దేవును రి కుమార్ స్వామి తెలిపారు
స్థానిక ఎన్నికల నేపథ్యంలో జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల నర్సాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని మాజీ ఉప సర్పంచ్ గోపాల్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వం చేయని విధంగా కాంగ్రెస్ పార్టీ గడిచిన 21 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించిందని ఆయన గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, మౌలిక వసతులు ఇలా గ్రామాలన్నింటికీ చేరాయని వివరించారు. “ఈ పథకాలు అభ్యర్థుల విజయానికి ప్రధాన బలం అవుతాయి” అని అన్నారు,పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అదుబాటులో ఉండి ప్రభుత్వం చేస్తున్న పనులను వివరించాలని సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయని, ప్రజలను ధైర్యంగా ఓటు అడుగుతామన్నారు.
ఎన్నికలు నిర్వహించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాదు
ఎన్నికలు ఎప్పుడు వచ్చిన బీజేపీ అభ్యర్థులదే విజయం
గ్రామాల అభివృద్ధి గాలికి ఒదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు మోడీ రవీందర్ ఆధ్వర్యంలో పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈకార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిన్నటి దాకా ఎన్నికల డ్రామా నిర్వహించిందని, వారిది బీసీలపై కపట ప్రేమ నటిస్తుందని వారు అన్నారు. కేవల రాజకీయ లబ్ది కోసమే బీసీ రిజర్వేషన్లు అమలు చేసినట్టుగా నటించి తిరిగి వారి నాయకులతోనే హై కోర్ట్ లో కేసులు వేపియ్యడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ డిక్లరేషన్ కి అన్ని పార్టీలు సహకరించాయని ఆనాడు తెలిపి, ఈరోజు కాంగ్రెస్ పార్టీయే ఒంటరి పోరాటం చేస్తుందని బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీసీ రిజర్వేషన్ లను కేంద్ర ప్రభుత్వం ఏనాడు వ్యతిరేకంచలేదని, భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు ప్రకటించిందని వారు తెలిపారు. కేవలం వారి ప్రభుత్వం మీద ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందొ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారో లేదో అని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చిన్న ట్రయల్ వేసినట్టు ఉందని, వారి ప్రభుత్వం మీద,వారి అభ్యర్థుల మీద తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుసుకొని ఎన్నికల పట్ల కాంగ్రెస్ పార్టీ వెనుకకు తగ్గినట్లు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన బీజేపీ అభ్యర్థులదే విజయం అని వారు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వనికి ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదని వారు తెలిపారు. గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేసి కాంగ్రెస్ ప్రభుత్వం కుల రాజకీయాలు చేస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్,జిల్లా కార్యవర్గ సభ్యులు బండ తిరుపతి రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు పోచంపెల్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, దళిత మోర్చా మండల అధ్యక్షులు సంటి జితేందర్, సీనియర్ నాయకులు జిట్టవేని అంజిబాబు, సూదగోని మహేష్ గౌడ్, కలిగేటి ఎల్లయ్య, యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడవెల్లి రాం, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి లక్ష్మణ్, మండల ఐటి సెల్ కన్వీనర్ మాడిశెట్టి జయంత్, బూత్ కమిటీ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్, నాగి లచయ్య, మాడిశెట్టి శ్రీసాయి, కోడూరి ప్రణయ్,కట్ట అనీల్ కుమార్, కొలిపాక రాజేష్, పురేళ్ల సన్నీ, కొలిపాక రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ బాకీ కార్డుతో కాంగ్రెస్ పునాదులు కదులుతున్నాయి
మాజీ ఎమ్మెల్యే గండ్ర
భూపాలపల్లి నేటిధాత్రి
Vaibhavalaxmi Shopping Mall
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆనాడు ఎన్నికలలో ఆరు గ్యారెంటీలు,420 హామీలు ఇచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నేటికి రోజులు లెక్కపెట్టి చూస్తే దాదాపుగా 660 రోజులు అయ్యింది. ఈ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయింది ఒక్కసారి వాళ్ళు ఇచ్చిన హామీలను గుర్తు చేద్దామని భారత రాష్ట్ర సమితి పార్టీ కార్య నిర్వాహాక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు భూపాలపల్లి నియోజకవర్గం లో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలను కలిసి కాంగ్రెస్ బాకీ కార్డు ఇస్తూ వివరిస్తూ వారిని చైతన్య పరిచే దిశలో మేము పని చేస్తుంటే వాళ్ళ పునాదులు కదులుతాయనే భయంతో ఈ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నకు ప్రశ్న సమాధానం ఇస్తూ ఏదో డోఖా కార్డుల పేరుతో కొత్త రాజకీయం మొదలు పెట్టారు. మేము ఏమైనా లేనివి ఇవ్వమని చెప్పుతున్నామా మీరు 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలను అమలు చేయాలని గుర్తు చేస్తున్నామని అన్నారు. బీ ఆర్ ఎస్ పార్టీ ప్రజలకు మంచి చేసిందా,చేడు చేసిందా అనేది వాస్తవం తెలుసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు సెక్యూరిటీ లేకుండా ప్రజలలోకి రావాలి. రాబోయే 38 నెలలు వీళ్ళు అధికారంలో ఉంటారు కావచ్చు.ఈ 38 నెలలు వీళ్ళ నీడలాగ వెంటాడుతూనే ఉంటాం. పడేండ్లలో డోఖా చేస్తే తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ చిత్రం ఈ విదంగా ఉండదు. భూపాలపల్లి చిన్న కుగ్రామం నేడు జిల్లా స్థాయికి వచ్చింది. మారుమూల జిల్లా అయిన ఇక్కడ మెడికల్ కాలేజ్ వచ్చింది, ఇంటింటికి నీళ్లు వచ్చిన్నాయి, పెన్షన్స్ వచ్చినాయి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినయి. కేసీఆర్ మాట చెప్పి ఎన్ని రోజులు నడుపుతారు ఈ ప్రభుత్వాన్ని. కనీసం యూరియా ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం, చేతకాని ముఖ్యమంత్రి అని ప్రజలు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలు పెట్టాలంటే బయపడుతున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదాలో మాకు ప్రశ్నించే హక్కు ఉంది డానికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పిఏసి ఎస్ చైర్మన్ మేకల సంపత్ మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకట రాణి సిద్దు గండ్ర హరీష్ రెడ్డి నూనె రాజు తదితరులు పాల్గొన్నారు
అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం లో విసుగు చెందారు
ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డు అందజేసి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండకడుదాం-సుంకె రవిశంకర్
కరీంనగర్, నేటిధాత్రి:
Vaibhavalaxmi Shopping Mall
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ ఎస్ సత్తా చాటాలని, ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డు అందజేసి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ హోటల్ లో చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది.
ఈసందర్బంగా చొప్పదండి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ మాట్లాడుతూ రెండేళ్లకే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, దీనిని ఎన్నికల్లో చూపించేలా కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని కోరారు. రేవంత్ ప్రభుత్వం రైతులకు యూరియా ఇవ్వలేకపోయిందని విమర్శించిరు.
రైతులు, మహిళా రైతులు రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడుతున్నారని, కొన్నిచోట్ల చెప్పులు కూడా క్యూలో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిందలు వేస్తూ రేవంత్ సర్కారు కాలం వెళ్లబుచ్చుతోందని, రేవంత్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌తో రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిందని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు గొప్పగా అమలు చేసిన కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.
స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే బీఆర్‌ఎస్ ఘన విజయం సాధించడం తథ్యమన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసి, అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి తెచ్చేలా నాయకులు, కార్యకర్తలు శ్రమించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా 420 హామీలను, ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకపోయిందని విమర్శించారు. యూరియా కోసం రైతన్నలు రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పింఛన్లు పెంచుతామన్న హామీని గాలికొదిలేశారని దు య్యబట్టారు. బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇప్పటికీ డ్రామాలాడుతోందని ధ్వజమెత్తారు.
ఈవిషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపైనే ఉందన్నారు. బిఆర్ఎస్ పార్టీ బిఫామ్ ఎవరికీ వచ్చిన క్రమశిక్షణ గల పార్టీగా అందరు బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని ఈసందర్బంగా కోరారు.
మహాదేవపూర్ మండల కేంద్రంలోని భారతదేశం ప్రపంచంలో అగ్రగామి కావడానికి ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా పంచ పరివర్తన కార్యక్రమాన్ని చేపట్టిందనీ ఆర్ఎస్ఎస్ రాష్ట్ర గ్రామ వికాస్ సంయోజక్ సత్యనారాయణ అన్నారు. ఆర్ఎస్ఎస్ కు దేశమే ముఖ్యమని కార్యకర్తలు కూడా దేశం తర్వాతనే ఇతర విషయాలకు ప్రాధాన్యమిచ్చే వారే ఈ సంస్థకోసం నిలబడతారని అన్నారు. పంచ పరివర్తనలో భాగంగా చెట్లు నాటడం, ఒకసారి వాడే ప్లాస్టిక్ను నిషేధించడం, భూగర్భ జలాలను పెంపొందించడానికి కట్టుబడి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. స్వ ఆధారిత కార్యక్రమాలు చేపట్టాలన్నారు. స్వభాష, స్వవేషం, స్వ సంస్కృతి తోపాటు స్వదేశీ వస్తువులను వాడాలని సూచించారు. హిందూ కుటుంబాలు సమిష్టిగా ఉండేలా మానక మానసిక స్థితిని పెంపొందించే విధంగా చూడాలన్నారు. పండుగ పర్వదినాలలో సమిష్టి కుటుంబంలోని వారందరూ కలుసుకునే సంప్రదాయాన్ని పాటించారన్నారు. పూర్వకాలం నుండి హిందుత్వంలో జ్ఞానానికే ప్రథమ ప్రాధాన్యం ఉన్నదే తప్ప కుల మతాలకు వర్గ విభేదాలకు తావు లేదని అలాంటి సమాజాన్ని పునర్ నిర్మించాలన్నారు అన్నారు. కుల మతాలను పాటించకుండా అందరిలో దైవమున్నాడని భావించే సమరసత కోసం కృషి చేయాలని అన్నారు. పౌర విధులను సక్రమంగా నిర్వహించారని రాజ్యాంగం, చట్టాలను పాటించడం ద్వారా సమాజంలో పౌర భావనను పెంపొందించడం ద్వారా భారతదేశాన్ని మరోపదేళ్లలో ప్రపంచంలోని అన్నారు. శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ప్రజలకు ఆర్ఎస్ఎస్ లో పరిచయం చేయడానికి ప్రతి మండలంలో వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖండ కార్యవాహ గడ్డం శ్రీనివాస్, విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు దేవరావు, తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని కిష్టంపేట ఎంపీటీసీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేయనున్నట్లు దాసరి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.గత కొన్ని సంవత్సరాలుగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న శ్రీనివాస్ కు మండల సమస్యలపై మంచి పట్టు ఉండటం వలన మౌలిక సదుపాయాల అభివృద్ధి కై కృషి చేస్తారని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జరగబోయే ఎన్నికల్లో ఎంపీపీ సీట్ కోసం రసవత్తరంగా పోటీ ఉండనున్నట్లు తెలిపారు.రాజకీయాల్లోకి చదువు కున్న యువతి, యువకులు రావాలని, అప్పుడే అన్ని గ్రామాలలో అభివృద్ధి మెరుగవుతుందని అన్నారు.తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి ప్రజలకు సేవ చేసే వారిని ప్రోత్సహిస్తుందని అన్నారు.
ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్ట భూమి పూజ
నేటిధాత్రి, వరంగల్
హన్మకొండ హంటర్ రోడ్డులోని గౌడ హాస్టల్ ముందు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్ట భూమి పూజ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు తీగల జీవన్ గౌడ్ మాట్లాడుతూ భరత మాత ముద్దుబిడ్డ తొలి తెలుగు చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర ప్రపంచ ప్రసిద్ధిగాంచిందన్నారు. తెలాంగాణకె తిరుగుబాటు నేర్పిన యోధుడు సర్వాయి పాపన్న గౌడ్ అని పేర్కొన్నారు. గౌడ జాతి గర్వకారకుడైన తెలంగాణా బహుజన యోధుడు సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో గౌడ కులస్తులందరు రాజకీయలకు అతీతంగా ఐక్యంగా ఉండి ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలని పిలిపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోపా పౌండర్ అధ్యక్షులు పెరుమాండ్ల మధుసూదన్ గౌడ్, డా. బైరి లక్ష్మి నారాయణ గౌడ్, పులి శ్రీనివాస్ గౌడ్, చిర్ర రాజు గౌడ్, విగ్రహ ప్రతిష్టాపన కమిటీ సభ్యులు జనగాం శ్రీనివాస్ గౌడ్, జూలూరి రంజిత్ గౌడ్, బండారి జనార్ధన్ గౌడ్, అనంతుల రమేష్ గౌడ్, మార్క రవి గౌడ్, మాచర్ల శరత్ గౌడ్, కునురీ రంజిత్ గౌడ్,గట్టు నరేష్ గౌడ్, గోపగాని వెంకటేశ్వర్లు గౌడ్, కార్పొరేటర్ పోశాల పద్మ స్వామి గౌడ్, ఏసీపి. కె. నాగయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
దుర్గా మాత చల్లని దీవెనలు, ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. (శనివారం)భూపాలపల్లి పట్టణంలోని కేటీకే – 1 ఇంక్లైన్ కేటీకే OC- 2 ప్రాజెక్టు ఆలయాల్లో జరిగిన దుర్గా మాత పూజల్లో సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం రాజేశ్వర్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, మహా అన్నదాన కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. దుర్గా మాత చల్లని దీవెనలు, ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలన్నారు. అమ్మవారి కృపతో ప్రజలంతా దినదినాభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే దుర్గా దేవీని వేడుకున్నారు. ఈ కార్యక్రమాలల్లో సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకించిన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి పురస్కరించుకొని శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ కొమరంభీం జిల్లా వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న జన్మించాడని, స్వాతంత్రోద్యమంలో, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడని తెలిపారు. రాజకీయరంగంలో వివిధ పదవులలో ప్రజా శ్రేయస్సుకు ఎనలేని సేవలు అందించారని, తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త అని,తెలంగాణ తొలి,మలిదశ ఉద్యమాలలో తన వంతు పాత్ర పోషించారని తెలిపారు.మహనీయుల జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని,వారు చూపిన సన్మార్గంలో కొనసాగుతూ రాష్ట్ర అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
దేశ పురోగతిలో తిరుపతి ఐఐటీ ప్రధాన భూమిక పోషిస్తుందని తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి ప్రశంసించారు. తిరుపతి ఐఐటీ శాశ్వత క్యాంపస్ అభివృద్ధి పనుల్లో భాగంగా రూ.2313 కోట్ల అంచనాలతో ఫేజ్-బీ పనులకు శనివారం ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో భూమి పూజ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ తిరుపతి ఐఐటీ రెండో దశ నిర్మాణానికి శంకుస్థాపన జరగడం ఈ ప్రాంతానికి గర్వకారణమన్నారు. అలాగే చారిత్రక రోజన్నారు. ఇది కేవలం భవనాల నిర్మాణం మాత్రమే కాదు యువత ఉజ్వల భవిష్యత్ నిర్మాణమన్నారు. ఇందుకోసం సుస్థిరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ, విద్యార్థుల ఆవిష్కరణలకు, పరిశోధనలకు కొత్త దారులు తీసుకువస్తున్న ప్రాజెక్టుగా ఆయన అభిప్రాయపడ్డారు. తక్కువ సమయంలోనే ఐఐటీ పరిశోధన ఫలితాలు అందుతున్నాయని ఆయన ప్రశంసించారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన డీఆర్‌డీఏ, టాటా, జేఎస్‌డబ్ల్యూ లాంటి సంస్థలతో తిరుపతి ఐఐటీ సమన్వయంతో ముందుకెళుతూ పరిశ్రమలకు బలం చేకూర్చి, స్థానిక ఆర్థిక వ్యవస్థపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపిందన్నారు. అదే సమయంలో ఈ ప్రాంతంలోని మామిడి, టమాటా రైతులకు ఉపయోగపడేలా ఆహార ప్రాసెసింగ్ రంగంపై కూడా ఐఐటీ తిరుపతి దృష్టి సారించిందన్నారు. వ్యవసాయ రంగానికి కూడా తన పరిశోధన ఫలాల్ని అందిస్తోందని ఆయన కొనియాడారు. దీని ద్వారా రైతులకు సాంకేతికత, ఆవిష్కరణలు, వృద్ధి అందుబాటులోకి వస్తాయన్నారురెండో దశలో సుమారు 2,500 మంది విద్యార్థులకు సేవలందించనున్న ఈ సంస్థ యువతకు, ప్రాంత అభివృద్ధికి గొప్ప తోడ్పాటు అందిస్తోందన్నారు. ఈ ప్రాజెక్టును ఆమోదించి తిరుపతికి కేటాయించినందుకు గాను ప్రధానమంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి నిజమైన దూరదృష్టి గల నాయకుడైన ఆయన ఎప్పుడైనా తిరుపతి అభివృద్ధి కోసం కోరినప్పుడు అపారమైన సహకారం అందిస్తున్నారని ఆయన కొనియాడారు. ఈ ప్రాంత ప్రజల తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఎంపీ మద్దిల గురుమూర్తి పేర్కొన్నారు. ప్రధాని చొరవతో అభివృద్ధి పనులు చేపట్టడంతో విద్యార్థులు తమ కలల్ని సాకారం చేసుకునే అవకాశం లభిస్తుందన్నారు. దేశాన్ని ముందుకు నడపడంలో ఐఐటీ నుంచి వచ్చే యువత కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన కొనియాడారు. మరీ ముఖ్యంగా తన సొంత మండలంలో ఉన్న ఐఐటీకి అదనపు సౌకర్యాలు కల్పించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలన్నారు. గతంలో వైసీపీ హయాంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి ఐఐటీ మొదటి ఫెజ్ నిర్మాణానికి ఎంతో తోడ్పాటు అందించారన్నారు. దేశం ప్రగతి పథంలో ముందుకెళ్లడానికి ప్రత్యేక భూమిక తిరుపతి ఐఐటీ పోషిస్తోందన్నారు. ఇలాంటి కార్యక్రమంలో తాను పాల్గొనడం సంతోషంగా, గర్వంగా వుందన్నారు.
కొత్తగూడ మండల కేంద్రం లో నిర్వహించిన పాలాభిషేకం కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ తోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని పల్లెలు పట్టణాల్లాగా తయారవుతాయని..ప్రజలు భావించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన పూర్తి ఫలాలను ఒక్కొక్కటిగా అమలుపరుస్తూ ప్రజలు నమ్మకాన్ని నిజం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మరియు మంత్రివర్గానికి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ మరియు సంక్షేమ శాఖ ధనసరి అనసూయ సీతక్క ప్రత్యేక కృషితో ఏజెన్సీ మండలం మండలమైన కొత్తగూడ మండల కేంద్రంలో సుమారు 12 కోట్ల రూపాయలతో సెంట్రల్ లైటింగ్ మంజూరు చేయడం జరిగిందని.. త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే పల్లెల మరియు పట్నాలు అభివృద్ధి చెందుతాయని మరోసారి రుజువైందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి,* మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి,ధనసరి అనసూయ సీతక్క చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామపార్టీ అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు..
కాంగ్రెస్ పాలన రాకతో తెలంగాణకు స్వేచ్ఛ -కంచెలు తొలగించాం..మానసిక బానిసత్వ సంకెళ్లు తెంచాం..
– అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ద్విముఖ వ్యూహంతో రేవంత్ రెడ్డి పాలన
-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
-విలేకరుల సమావేశంలో పోలినేని లింగారావు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
ఆంధ్ర నుండి విడివడిన తెలంగాణ రాష్ట్రం పదేళ్లలో నియంత పాలనలో మగ్గిపోయిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత తెలంగాణకు స్వేచ్ఛ లభించిందని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు నయా నిజాంగా మారి భూములను, ప్రాజెక్టులను మింగేశాడని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు..మొగుళ్లపల్లి పీఏసీఎస్ మాజీ చైర్మన్ పోలినేని లింగారావు గత ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. గురువారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేజిక్కించుకున్న కేసీఆర్ తెలంగాణ ప్రజల పాలిట నయా నిజాంగా మారాడన్నారు. పదేళ్లలో తెలంగాణ నియంత పాలనలో మగ్గిపోయిందని, ప్రజాస్వామ్యం పీక పీకేశారని ఆయన మండిపడ్డారు. ఎన్నికలకు ముందు పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నియంత పాలన నుంచి తెలంగాణ ప్రజలను విముక్తి చేస్తామని చెప్పిన ప్రకారంగానే 2023 డిసెంబర్ 3న తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం స్వేచ్ఛను ప్రసాదించిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాయంలో ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల ఫలితంగా అన్ని రంగాల్లో రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి సాధిస్తుందన్నారు. సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన అని, దీనికి చరిత్రే సాక్ష్యమన్నారు. తెలంగాణలో దొరవేసిన కంచెలను తెంచి..మానసిక బానిసత్వ సంకెళ్లను తెంచామన్నారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ద్విముఖ వ్యూహంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను కొనసాగిస్తున్నారన్నారు. పాలనలో పారదర్శకత..అభివృద్ధిలో ఆధునికత..సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ..తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో ఆదర్శవంతమైన రాష్ట్రంగా తెలంగాణ రూపుదిద్దుకుంటుందన్నారు. అదేవిధంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా ఉంటూ..నియోజకవర్గానికి అధిక మొత్తంలో నిధులను తీసుకువచ్చి..కనివిని ఎరుగని రీతిలో భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నాడని పోలినేని లింగారావు కొనియాడారు.
అంబేద్కర్ చౌరస్తా టు జంగేడు వరకు నాలుగు లైన్ల రోడ్డు పనులు గత రెండు సంవత్సరాల నుండి పూర్తికాలేదు ఈ రోడ్డు నిధులను స్థానిక ఎమ్మెల్యే తన సొంత మండలమైన ఘనపురం మండలానికి నిధులను దారి మళ్లించారు ఈ రోడ్డును వెంటనే పూర్తి చేయాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమనే రెడ్డి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ భూపాలపల్లి అంబేద్కర్ చౌరస్తా నుండి జంగేడు వరకు సెంట్రల్ లైటింగ్ నాలుగు లైన్లతో రోడ్డుకు 10 కోట్లతో రూపాయలతో రోడ్డు నిర్మాణానికి గత బీ ఆర్ ఎస్ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం జరిగింది కానీ ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు 10 కోట్లు కేటాయించడం జరిగింది కానీ ఆ నిధులను స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యే భూపాలపల్లి అభివృద్ధిని మరిచి నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం నిధులను తన సొంత మండలమైన ఘనపురం మండలానికి నిధులను దారి మళ్లించారు ఇప్పటికైనా అంబేద్కర్ చౌరస్తా టు జంగేడు వరకు నాలుగు లైన్ల రోడ్డుకు నిధులు కేటాయించి రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యేను జిల్లా కలెక్టర్ ను డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్ మాజీ మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి సిద్దు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి రఘుపతిరావు తిరుపతి మాడ హరీష్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ డా బెల్లయ్య నాయక్ అన్నారు. బుధవారం ఐడిఓసి కార్యాలయంలో జరిగిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముందుగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరే పుష్ప గుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 77 సంవత్సరాల క్రితం తెలంగాణ గడ్డపై రాచరికానికి, నియంతృత్వానికి, పెత్తందారీ తనానికి వ్యతిరేకంగా సాయుధ వీరులు నిజాం నిరంకుశ రాజును, ఆనాటి రాచరిక వ్యవస్థను ముట్టడించి తెలంగాణ బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం సెప్టెంబర్ 17, 1948న మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ గడ్డపై ఆవిష్కృతమైందన్నారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం కోసం రాచరిక పోకడపై చేసిన తిరుగుబాటు అది పేర్కొన్నారు. తెలంగాణ అంటే త్యాగం. ఆ త్యాగాలకు ఆద్యుడు దొడ్డి కొమురయ్య, వరంగల్ కు చెందిన షేక్ బందగి భాను నాయక్ లకు నివాళులర్పించారు. తమ ప్రాణాలను ఒడ్డి సాయుధ పోరాటానికి ఊపిరి పోసిన నాటి సాయుధ పోరాటంలో ఎందరో తమ జీవితాలను త్యాగం చేశారని కొనియాడారు. సర్వం కోల్పోయినా లక్ష్య సాధనలో వెనుకంజ వేయక ఆనాటి సాయుధ పోరాటంలో ప్రాణాలు వదిలిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన రోజని, ఈ శుభదినాన్ని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. సెప్టెంబర్ 17, 1948న తెలంగాణ ప్రజలు నిజాం రాచరిక వ్యవస్థను కూలదోసి… ప్రజాస్వామ్య ప్రస్థానానికి నాంది పలికారన్నారు. ప్రజా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం 4 కోట్ల ప్రజల ఆకాంక్ష, వారి ఆలోచన, నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి, గడిచిన పదేళ్లలో ప్రజలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో తమ భాదలు తీరతాయని ఆశించారో అవి నెరవేరలేదన్నారు. ప్రభుత్వ ఆశ, ఆలోచన, ఆచరణ ప్రతీది ప్రజా కోణమేనని, అందుకే ఈ శుభ దినాన్ని ప్రజా పాలన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాణ త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాలన పారదర్శకంగా, బాధ్యతగా ఉండాలని, ప్రతి నిర్ణయంలో ప్రజల కోణం ఉండాలని, అమరుల ఆశయాలు ఉండాలని, యువత ఆకాంక్షలు ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన క్షణం నుండి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ, విధ్వంసమైన తెలంగాణ పునరుజ్జీవనానికి చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఏఎస్పి నరేష్ కుమార్, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజలు, పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బీ గితే
పోలిసుల గౌరవ వందనం స్వీకరించిన ప్రభుత్వ విప్
సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)
ప్రజా పాలన దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బీ గితే హాజరయ్యారు. ముందుగా జాతీయ జెండాను ప్రభుత్వ విప్ ఎగుర వేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల పై వివరించారు.
ఈ సందర్బంగా విప్ మాట్లాడారు. సెప్టెంబర్ 17, 1948లో తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ రోజును తెలంగాణ ప్రజా పాలన వేడుకలను జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. 1948 సెప్టెంబర్ 17న సువిశాల భారత దేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు స్వతంత్ర్య భారతావనిలో 60 ఏండ్ల స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి పథంలో ముందంజలో ఉన్నదని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం తేదీ 09/12/2023న కొలువుదీరింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నది. ఈ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించింది.
2047 నాటికి దేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం మాది. ఈ సంకల్పానికి దార్శనిక పత్రమే ‘తెలంగాణ రైజింగ్ 2047’. 2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ – 2047 ఉంటుంది. ఇది కేవలం ప్రణాళిక కాదు, ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పం. ప్రజా ప్రభుత్వం ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు క్లుప్తంగా మీ ముందు ఉంచుతున్నాను. మహిళల అభ్యున్నతే ధ్యేయంగా: ఇందిరా మహిళా శక్తిలో భాగంగా డీఆర్డీఓ, మెప్మా ఆద్వర్యంలో జిల్లాలోని ఎస్ హెచ్ జీల ద్వారా 23 ఫర్టిలైజర్ షాపులు ప్రారంభించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 7వేల 111 లక్ష్యానికి గాను ఇప్పటిదాకా 1 వెయ్యి 586 యూనిట్లను గుర్తించి 200 కోట్ల బ్యాంక్ రుణాలు ఇవ్వడం జరిగింది. శ్రీనిధి ద్వారా రూ.68 కోట్లు లక్ష్యం కాగా, ఇప్పటిదాకా రూ. 25 కోట్ల రుణాలు ఇవ్వడం జరిగింది. 5వేల 691 యూనిట్లు లక్ష్యం కాగా, వెయ్యి 607 యూనిట్లు గ్రౌండింగ్ చేయడం జరిగింది. చేయూత పింఛన్లు జిల్లాలో లక్ష 17 వేల 370 మంది పించన్ దారులకు ప్రతి నెలా రూ.25 కోట్ల 73 లక్షలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఎస్ హెచ్ జీ మహిళలకు చీరలు: సిరిసిల్లలోని నేతన్నలకు చేతి నిండా పనితో భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 64 లక్షల 7౦ వేల మందికి పైగా ఉన్న ఎస్ హెచ్ జీ సభ్యులకు ఏడాదికి ఉచితంగా రెండు ఏకరూప చీరల కోసం 4 కోట్ల 30 లక్షల మీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్ సిరిసిల్ల మరమగ్గాలకు కేటాయించడం జరిగినది. దీని ద్వారా జిల్లాలోని మరమగ్గాల ఆసాములు, కార్మికులు, అనుబంధ కార్మికులకు 8 నుంచి 10 నెలల వరకు ఉపాధి దొరుకుతున్నది. సన్న బియ్యం పంపిణీ: పీడీఎస్ వ్యవస్థ పేదల ఆహార భద్రతకు భరోసా ఇస్తోంది. అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి “సన్న బియ్యం” పంపిణీని ప్రారంభించింది. రాష్ట్రంలో 13 వేల కోట్ల రూపాయల వ్యయంతో 3 కోట్ల 10 లక్షల మందికి సన్నబియ్యం అందించడం జరుగుతున్నది. లక్ష 77 వేల 851 కుటుంబాలు, 5 లక్షల 35 వేల 920 మందికి సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతున్నది.నూతన రేషన్ కార్డులు: జిల్లాలో కొత్తగా 14 వేల 75 రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. 3౦ వేల 376 మంది కుటుంబ సభ్యుల పేర్లు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో చేర్చడం జరిగింది. పదేళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో… రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తోంది. రైతు రుణమాఫీ: గతేడాది ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలోని 25 లక్షల 35 వేల మంది రైతులకు, రూ.20 వేల కోట్ల రుణమాఫీ చేసి.. కొత్త చరిత్ర సృష్టించడం జరిగింది. “ఇందిరమ్మ రైతు భరోసా” కింద ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి సాయం ప్రకటించి, తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేయడం జరిగింది. రాష్ట్రంలోని 70 లక్షల 11 వేల 184 మంది రైతులకు, అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1.2 లక్షల మంది రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించడం జరిగింది. జిల్లాలో 393 మంది రైతుల కుటుంబాలకు 18 కోట్ల రూపాయలు బీమా కింద పంపిణీ చేశాము. రైతు భరోసా కింద లక్ష 26వేల 278 మంది రైతులకు.. 149 కోట్ల 27 లక్షల రూపాయలు పంపిణీ చేశాము. 47 వేల 977 మంది రైతులకు 381 కోట్ల 45లక్షల రుణ మాఫీ చేశాము. రాష్ట్రంలో 7 వేల 178 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. సన్నాలకు క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తున్నామని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ లో భాగంగా 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతున్నది. దీని కోసం రూ.16 వేల 691 కోట్ల సబ్సిడీని విద్యుత్తు సంస్థలకు చెల్లించడం జరుగుతున్నది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగ రాసి అన్నదాతల సంక్షేమానికి రూ. లక్ష 13 వేల కోట్ల రూపాయలను ప్రజా ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇందిరమ్మ ఇండ్లు: తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3వేల 500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగింది. దీనికి రూ.22 వేల 500 కోట్లు వెచ్చించడం జరుగుతున్నది. జిల్లాలో 12 వేల 623 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, 7 వేల 927 ఇండ్లు సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు, మిడ్ మానేర్ ముంపు గ్రామాల ప్రజలకు 4వేల 696 ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మంజూరు చేసింది. 10వేల 234 ఇంటి నిర్మాణ మంజూరు ఉత్తర్వులు పంపిణీ చేయగా, 5 వేల 305 గృహాలకు లబ్దిదారులు ముగ్గు పోయడం జరిగింది. వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 38 కోట్లకు పైగా నేరుగా జమ చేసింది. మహాలక్ష్మీ పథకం: ద్వారా ఆడబిడ్డలకు రూ.6 వేల 790 కోట్లు ఆదా అయ్యింది. రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం మొత్తంగా రూ. 46 వేల 689 కోట్లు సమకూర్చింది. జిల్లాలో 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 119 కోట్ల 50 లక్షల రూపాయల విలువైన 315 లక్షల జీరో టికెట్లపై మహిళలు ప్రయాణం చేశారు. గృహజ్యోతి పథకం: ద్వారా మార్చి 2024 నుంచి ఆగస్ట్ 2025 వరకు మొత్తం 17 లక్షల 52 వేల జీరో కరెంట్ బిల్లులు జారీ చేసి, రూ. 67 కోట్ల 70 లక్షల లబ్ది చేకూర్చాము. జెగ్గారావుపల్లి, పద్మనగర్, పాపయ్యపల్లి, గుండారం, తిప్పాపూర్ (వేములవాడ)లో 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాల కోసం ఎన్.పీ.డీ.సీ.ఎల్ కు ప్రతిపాదనలు పంపించడం జరిగింది. వైద్యారోగ్య శాఖ : ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో వైద్యారోగ్యంపై 16 వేల 521 కోట్ల రూపాయలు వ్యయం చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 నుండి 10 లక్షలకు పెంచగా, డిసెంబర్ 9వ తేదీ 2023 నుంచి ఆగస్ట్ 2025 వరకు 24 వేల 154 మంది రోగులు రూ. 62 కోట్ల విలువైన ఆపరేషన్లు, ఇతర వైద్య సేవలు పొందడం జరిగింది. జిల్లాలో సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇప్పటిదాకా 4వేల 795 చెక్కుల ద్వారా రూ. 16కోట్ల 85 లక్షలు, అలాగే 275 ఎల్ఓసీల ద్వారా రూ. 5 కోట్ల సాయం అందజేయడం జరిగింది. మత్స్య శాఖ: ధర్తి అబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ పథకంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంపిక చేసిన రుద్రంగి, వీర్నపల్లి నుంచి గిరిజన ప్రాంతాల లబ్దిదారుల నుంచి 82 మంది దరఖాస్తులు ప్రక్రియలో ఉన్నాయి. ఉద్యోగాల భర్తీ: యువతను రక్షించుకుంటేనే తెలంగాణకు భవిత. యువత ఉద్యోగ, ఉపాధికి పెద్ద పీట వేస్తున్నాం.ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం టీ.జీ.పీ.ఎస్సీని సంస్కరించాం. 20 నెలల కాలంలో దాదాపు 60 వేల ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. అలాగే భూ భారతి అమలులో భాగంగా జిల్లాలో అవసరమైన గ్రామ పాలన అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నియమించడం జరిగింది. పోటీ పరీక్షల్లో రాణించేలా: జిల్లాలోని విద్యార్థులు జాతీయస్థాయిలో పోటీ పరీక్షలకు సిద్ధం చేసేలా 39 రెసిడెన్షియల్ విద్యాలయాల్లో అన్ అకాడమీ సంస్థ ద్వారా 25 లక్షల రూపాయలతో ఐఐటీ ఫౌండేషన్, ఐఐటీ-జేఈఈ, నీట్-యూజీ మెడికల్ ఆన్లైన్ కోచింగ్ తరగతులను నిర్వహిస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడం జరుగుతున్నది. మొత్తం 13 వేల 564 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. పనుల జాతర: జిల్లాలోని 12 మండలాల పరిధిలోని అన్ని గ్రామాలలో పనుల జాతర కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఉపాధి హామీ పథకం, ఆర్ డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, స్వచ్ఛభారత్ వంటి విభాగాల్లో రూపాయలు 7 కోట్ల 80 లక్షల విలువ గల 258 పనులు చేపట్టడం జరుగుతున్నది.చివరి ఆయకట్టుకు నీరు అందించేలా: తెలంగాణ మాగాణాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలతో పెండింగ్ ప్రాజెక్టులను లక్ష్యాలు నిర్దేశించుకుని పూర్తి చేస్తున్నామని, కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీపడమని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.