చిట్యాల లో చందాపూర్ లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పరిశీలిస్తున్న కలెక్టర్
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు ప్రొసీడింగ్స్ తీసుకొని నిర్మాణం చేపట్టని వారు త్వరగా నిర్మాణాలను చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు శుక్రవారం జిల్లా కలెక్టర్ చందాపూర్, చిట్యాల గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చేందుకు 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేపడుతోందని, పనులను నాణ్యవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురబి ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు నగదు పడే విధంగా చూడాలని, పెండింగ్ సమస్యలు ఏమైనా ఉంటే నివేదిక సమర్పించాలని కలెక్టర్ సూచించారు ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే లబ్ధిదారులకు ఇసుకకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. చందాపూర్ గ్రామ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని, గృహ నిర్మాణ శాఖ డి ఈ విఠోబా, తహసిల్దార్ రమేష్ రెడ్డి, ఎంపీడీవో,అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు
