*పెరుమాళ్ళపల్లిలో వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జయంతి మహోత్సవం…
*అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న…
*తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి…
తిరుపతి రూరల్(నేటిధాత్రి:
తిరుపతి రూరల్ పెరుమాళ్ళపల్లి గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జయంతి మహోత్సవాలు గురువారం అత్యంత వైభవంగా జరిగాయి.
ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక అన్నదాన కార్యక్రమంలో తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు.
అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పెరుమాళ్ళపల్లి గ్రామ ప్రజల ఐక్యతతో ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు దిగ్విజయంగా జరపడం సంతోషకరమన్నారు.
లోక కల్యాణం కోసం, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన తుడా ఛైర్మన్ కి గ్రామ పెద్దలు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు.
పూజా కార్యక్రమాల అనంతరం గ్రామస్తులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి, శేషవస్త్రంతో సత్కరించారు.
ఈ మహోత్సవంలో పెరుమాళ్ళపల్లి గ్రామస్తులు, భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
