ఈ ఐదు రాశులకు అదృష్ట యోగం.. ఎప్పటి నుంచి అంటే..

ఈ ఐదు రాశులకు అదృష్ట యోగం.. ఎప్పటి నుంచి అంటే..

 

భాద్రపద మాసంలో పౌర్ణమి ముందు వచ్చే వారంలో ఐదు రాశుల వారికి అదృష్ట యోగం పట్టనుంది. దీంతో ఈ రాశుల వారు జాక్ పాట్ కొట్టనున్నారు.

ఈ ఐదు రాశుల వారికి సెప్టెంబర్ మొదటి వారం నుంచి అదృష్ట యోగం ప్రారంభం కానుంది. దీంతో వీరి భవిష్యత్తు శుభ యోగంగా మారనుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల స్థానం, వాటి సంయోగాలు మన జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. సెప్టెంబర్ తొలి వారం కొన్ని నిర్దిష్ట రాశి చక్ర గుర్తులకు చాలా శుభ ప్రదం. ఈ సమయంలో ఏర్పడే ధనలక్ష్మి యోగం కారణంగా.. ఆర్థిక విషయాలు, వృత్తి, వ్యక్తిగత జీవితంలో సానుకూల మార్పులుంటాయి.

సెప్టెంబరు 9 నుంచి ఆసియా కప్‌..

సెప్టెంబరు 9 నుంచి ఆసియా కప్‌

పురుషుల ఆసియా కప్‌ టీ20 టోర్నమెంట్‌ సెప్టెంబరు 9 నుంచి 28 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. ఈ విషయాన్ని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) చైర్మన్‌ మొహిసిన్‌ నఖ్వీ శనివారం వెల్లడించాడు. ప్రధాన ప్రత్యర్థులు…

టోర్నీ వేదిక యూఏఈ

14, 21న ఇండో-పాక్‌ మ్యాచ్‌లు

గ్రూప్‌ ఎ: భారత్‌, పాకిస్థాన్‌, ఒమన్‌, యూఏఈ.

గ్రూప్‌ బి: శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్థాన్‌, హాంకాంగ్‌.

కరాచీ/న్యూఢిల్లీ: పురుషుల ఆసియా కప్‌ టీ20 టోర్నమెంట్‌ సెప్టెంబరు 9 నుంచి 28 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. ఈ విషయాన్ని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) చైర్మన్‌ మొహిసిన్‌ నఖ్వీ శనివారం వెల్లడించాడు. ప్రధాన ప్రత్యర్థులు భారత్‌, పాకిస్థాన్‌ జట్లు ఒకే గ్రూపు నుంచి తలపడనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య సెప్టెంబరు 14న దుబాయ్‌ అంతర్జాతీయ స్టేడియంలో మ్యాచ్‌ జరగనుంది. ఆపై సూపర్‌ ఫోర్‌లో భాగంగా సెప్టెంబరు 21న భారత్‌-పాక్‌ మరోసారి ఢీకొంటాయి. ఇక..రెండు జట్లు కనుక ఫైనల్‌కు చేరితే ముచ్చటగా మూడోసారి తలపడతాయి. ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విడదీశారు. ప్రతి గ్రూపులో తొలి రెండు స్థానాలలో నిలిచిన జట్లు సూపర్‌-4కి చేరతాయి. సూపర్‌-4లో ప్రతి జట్టు మిగిలిన మూడు జట్లతో తలపడుతుంది. సూపర్‌-4 నుంచి రెండు జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. సెప్టెంబరు 10న యూఏఈతో జరిగే మ్యాచ్‌తో టోర్నీని టీమిండియా ఆరంభిస్తుంది. 19న ఒమన్‌తో తలపడుతుంది. భారత్‌ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరిగే అవకాశముంది.

సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి..

సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి

ప్రభాస్‌ కథానాయకుడిగా సందీ్‌పరెడ్డి వంగా తెరకెక్కించనున్న చిత్రం ‘స్పిరిట్‌’. త్రిప్తీ దిమ్రీ కథానాయిక. సెప్టెంబరు చివరి వారం నుంచి ‘స్పిరిట్‌’ రెగ్యులర్‌ షూట్‌ను…

ప్రభాస్‌ కథానాయకుడిగా సందీ్‌పరెడ్డి వంగా తెరకెక్కించనున్న చిత్రం ‘స్పిరిట్‌’. త్రిప్తీ దిమ్రీ కథానాయిక. సెప్టెంబరు చివరి వారం నుంచి ‘స్పిరిట్‌’ రెగ్యులర్‌ షూట్‌ను ప్రారంభించనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. భారతీయ సినీ చరిత్రలోనే ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. ఈ సినిమాను భూషణ్‌కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. ఇందులో శక్తిమంతమైన పోలీస్‌ అధికారి పాత్రలో ప్రభాస్‌ కనిపించనున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version