సెప్టెంబరు 9 నుంచి ఆసియా కప్‌..

సెప్టెంబరు 9 నుంచి ఆసియా కప్‌

పురుషుల ఆసియా కప్‌ టీ20 టోర్నమెంట్‌ సెప్టెంబరు 9 నుంచి 28 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. ఈ విషయాన్ని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) చైర్మన్‌ మొహిసిన్‌ నఖ్వీ శనివారం వెల్లడించాడు. ప్రధాన ప్రత్యర్థులు…

టోర్నీ వేదిక యూఏఈ

14, 21న ఇండో-పాక్‌ మ్యాచ్‌లు

గ్రూప్‌ ఎ: భారత్‌, పాకిస్థాన్‌, ఒమన్‌, యూఏఈ.

గ్రూప్‌ బి: శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్థాన్‌, హాంకాంగ్‌.

కరాచీ/న్యూఢిల్లీ: పురుషుల ఆసియా కప్‌ టీ20 టోర్నమెంట్‌ సెప్టెంబరు 9 నుంచి 28 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. ఈ విషయాన్ని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) చైర్మన్‌ మొహిసిన్‌ నఖ్వీ శనివారం వెల్లడించాడు. ప్రధాన ప్రత్యర్థులు భారత్‌, పాకిస్థాన్‌ జట్లు ఒకే గ్రూపు నుంచి తలపడనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య సెప్టెంబరు 14న దుబాయ్‌ అంతర్జాతీయ స్టేడియంలో మ్యాచ్‌ జరగనుంది. ఆపై సూపర్‌ ఫోర్‌లో భాగంగా సెప్టెంబరు 21న భారత్‌-పాక్‌ మరోసారి ఢీకొంటాయి. ఇక..రెండు జట్లు కనుక ఫైనల్‌కు చేరితే ముచ్చటగా మూడోసారి తలపడతాయి. ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విడదీశారు. ప్రతి గ్రూపులో తొలి రెండు స్థానాలలో నిలిచిన జట్లు సూపర్‌-4కి చేరతాయి. సూపర్‌-4లో ప్రతి జట్టు మిగిలిన మూడు జట్లతో తలపడుతుంది. సూపర్‌-4 నుంచి రెండు జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. సెప్టెంబరు 10న యూఏఈతో జరిగే మ్యాచ్‌తో టోర్నీని టీమిండియా ఆరంభిస్తుంది. 19న ఒమన్‌తో తలపడుతుంది. భారత్‌ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరిగే అవకాశముంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version